PRIME MINISTER NARENDRA MODI RELEASES BENEFITS UNDER PM CARES FOR CHILDREN SCHEME HERE IS MORE DETAILS SK
PM CARES For children: అనాథ పిల్లలకు రూ.10 లక్షల సాయం.. పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ
PM Cares For Children: పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఈ పథకం కింద ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు.
కరోనా మహమ్మారి (Coronavirus) ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులకు పిల్లలను దూరం చేసింది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. కరోనా సమయంలో ఎంతో మంది పిల్లలు పేరెంట్స్‌ని కోల్పోయారు. వారందరికీ కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. వారిని అన్ని విధాలా అదుకుంటామని గత ఏడాది ప్రకటించిన ప్రధాని మోదీ (PM Narendra Modi).. తాజాగా ఆ పథకాన్ని ప్రారంభించారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకం (PM CARES for children Scheme) కింద అనాథ పిల్లలకు ఆర్థిక ప్రయోజనాలను అందజేస్తున్నారు. ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకాన్ని ప్రారంభించారు.
'' కరోనా సమయంలో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలతో పాటు వెంటిలేటర్ల కొనుగోలు, ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ నిధులు ఎంతో ఉపయోగపడ్డాయి. వాటి వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోగలిగాం. ఐనప్పటికీ కొంత మంది మరణించారు. ఇప్పుడు వారి పిల్లల కోసం పీఎం కేర్స్ నిధులను ఉపయోగిస్తనున్నాం. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని తెస్తున్నాం. విద్యార్థుల ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.4వేలు చెల్లిస్తాం. 18-23 ఏళ్ల వయసులో ప్రతి నెలా స్టైపండ్ ఇస్తారు. 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షలను అందిస్తాం. అంతేకాదు ఆయుష్మాన్ హెల్త్ కార్డుల (Ayushman Bharat Health Cards)తో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందుతుంది.;; అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
When such children complete their schooling, more money would be needed for future dreams. For this, the youth from 18-23 years of age will get a stipend every month and when they are 23 years old, they will get Rs 10 lakhs: Prime Minister Narendra Modi pic.twitter.com/322eRqYZiA
2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో.. తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో తండ్రినో కోల్పోయిన పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని అర్హులు. వారికి ఈ పథకం కింద స్కాలర్షిప్పులు, పీఎం కేర్స్ పాస్ పుస్తకాలు, ఆయుష్మాన్ భారత్ వైద్యబీమా కార్డు అందిస్తున్నారు. 18 ఏళ్లు నిండేసరికి వారి పేరిట రూ. 10 లక్షల సొమ్ము ఉండేలా డిపాజిట్ చేస్తారు. అనంతరం ఆ డబ్బుతో వచ్చిన వడ్డీని ఆర్థిక సాయంగా అందిస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి డబ్బును వారి చేతికి అందిస్తున్నారు. అంతేకాదు ఉన్నత విద్య కోసం రుణం ఇస్తారు. ఆ లోన్‌కు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది.
ఈ పథకానికి అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' పేరుతో పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించారు. పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల ఆమోద ప్రక్రియ, సాయం అందించడం వరకు అన్నీ ఈ పోర్టల్ నుంచే సాగుతాయి. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలోనూ లబ్ధిదారులను గుర్తించారు. వారికి ఇవాళ్టి నుంచే పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.