Home /News /national /

Power crisis: దేశంలో విద్యుత్​ సంక్షోభంపై ప్రధానికి కారణాలు వివరించిన అధికారులు.. మోదీకి అధికారులు ఏం చెప్పారంటే..

Power crisis: దేశంలో విద్యుత్​ సంక్షోభంపై ప్రధానికి కారణాలు వివరించిన అధికారులు.. మోదీకి అధికారులు ఏం చెప్పారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బొగ్గు కొరత (Coal shortage), విద్యుత్ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi) మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు (coal storage) విద్యుత్ పరిస్థితిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    దేశవ్యాప్తంగా 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు (power plants) ఉండగా వాటిలో సగానికి పైగా ప్లాంట్లలో బొగ్గు నిల్వలు (coal storage) దాదాపు అడుగంటి పోయాయి. అక్టోబర్ లోనూ వర్షాలు (rains) వస్తుండటంతో బొగ్గు (coal) ఉత్పత్తికి అదనపు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ దశలో రాష్ట్రాల పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా తయారైంది. ఇప్పటికే ఏపీ, పంజాబ్​ ముఖ్యమంత్రులు బొగ్గు కొరత, విద్యుత్​ సంక్షోభం (power crisis)పై కేంద్రం సాయం కోరారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ విద్యుత్​ సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో బొగ్గు కొరత (Coal shortage), విద్యుత్ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi) మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు (coal storage) విద్యుత్ పరిస్థితిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బొగ్గు ఉత్పత్తిని పెంచామని అధికారులు వివరించగా, ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్ హామీ సైతం ఇచ్చారు.

    బొగ్గు ధరల్లో పెరుగుదలే కారణమంటూ..

    దేశంలో బొగ్గు కొరత (Coal shortage) ఏర్పడటానికి కారణాలను అధికారులు మోదీకి తెలియజేశారు. భారీ వర్షాలు, అంతర్జాతీయంగా బొగ్గు ధరల పెరుగుదల కారణాలని వివరణ ఇచ్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బొగ్గు ఉత్పత్తిని పెంచామని అధికార వర్గాలు వెల్లడించాయి. బొగ్గు నిల్వల విషయాన్ని పవర్ ప్లాంట్స్ (Power plants) అంచనా వేయలేక పోయాయని పేర్కొన్నాయి. మరోవైపు విద్యుత్‌ సంక్షోభాన్ని (power crisis) ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సంక్షోభం ముదురుతున్నవేళ కేంద్ర విద్యుత్‌ శాఖ పలు రాష్ట్రాలకు లేఖ రాసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం దగ్గర ఉన్న కేటాయించని విద్యుత్‌ వాడుకోవాలని రాష్ట్రాలను కోరింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కరెంట్‌ సాయం చేయాలని కోరింది.



    విద్యుత్ సంక్షోభంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రులతో సమస్య పరిష్కారంపై చర్చించారు. బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరాపై పర్యవేక్షణకు బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖల మంత్రులతో ఒక గ్రూప్‌ (group)ను ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యపై 24 గంటల పాటు సమీక్షించాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ ధరలు ఆకాశన్నంటాయి. సెప్టెంబర్ 15 వరకు యూనిట్ ధర 4 రూపాయల 60 పైసలు ఉంటే… అక్టోబర్ 8 నాటికి 15 రూపాయలకి చేరింది. దీంతో, విద్యుత్ కొనుగోలు చేయలేని స్థితిలోకి రాష్ట్రాలు వెళ్లిపోతున్నాయి.

    పంజాబ్‌ (Punjab)లోని బొగ్గు నిల్వలు కొన్ని రోజుల్లో అయిపోతాయని ముఖ్యమంత్రి చరణ్​జీత్ సింగ్​ చన్నీ (charan jeeth singh channi) ఇటీవలె చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని చన్నీ సమీక్షించారు. థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు లేని కారణంగా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు . నగరాలు, గ్రామాల్లో గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, వ్యవసాయ రంగానికి కోతలు విధించాల్సి వస్తుందన్నారు సీఎం చరణ్​జీత్​ సింగ్. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్​ సంక్షోభం తలెత్తింది. ప్రజలందరూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తెలియజేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Modi, National News, PM Narendra Modi, Power problems, Review meeting

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు