పీఎం మోదీ కొత్త ప్లాన్‌తో నీటి కష్టాలకు చెక్... ఒకరికి ఒక రోజుకు 55 లీటర్ల వాటర్ సప్లై

ప్రతీకాత్మక చిత్రం

లీటర్ పర్ క్యాపిటీ పర్ డే (LPCD) అంటే ఒక వ్యక్తికి ఒక రోజుకు ఎన్ని నీళ్లు అవసరం అవుతాయన్న లెక్కలు తీస్తున్నారు. ఒక వ్యక్తికి ఒక రోజుకు 43-55 లీటర్ల నీటిని సరఫరా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

 • Share this:
  ప్రజల నీటి కష్టాలకు చెక్ పెట్టే బృహత్తర కార్యక్రమానికి ప్రధాన మంత్రి మోదీ రూపకల్పన చేస్తున్నారన్న చర్చ ఉన్నతాధికార వర్గాల్లో జోరుగా జరుగుతోంది. 2024 నాటికి ప్రతీ గ్రామీణ భారతీయులందరికీ పైపు ద్వారా నీటిని సరఫరా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లాగా స్వచ్ఛ్ భారత్ కోశ్ పేరుతో వాటర్ ఫండ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) ఫండ్స్‌తో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించి స్వచ్ఛ్ భారత్ కోశ్‌లో నిధుల్ని సమీకరించే ఆలోచనలో ఉన్నారు. నల్ సే జల్ (కుళాయి నుంచి నీళ్లు) పేరుతో రూపొందిస్తున్న ఈ కార్యక్రమానికి అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆ తర్వాత ఈ పథకం కేంద్ర కేబినెట్ ముందుకు చర్చకు రానుంది. కేబినెట్ ఆమోదముద్ర పడిన తర్వాత ఈ పథకం అమలులోకి వస్తుంది.

  లీటర్ పర్ క్యాపిటీ పర్ డే (LPCD) అంటే ఒక వ్యక్తికి ఒక రోజుకు ఎన్ని నీళ్లు అవసరం అవుతాయన్న లెక్కలు తీస్తున్నారు. ఒక వ్యక్తికి ఒక రోజుకు 43-55 లీటర్ల నీటిని సరఫరా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. సాధారణ పరిస్థితుల్లో పైప్ ద్వారా ఒక వ్యక్తికి ఒక రోజుకు 43-55 లీటర్ల నీటిని సప్లై చేయాలన్న నియమం ఉంటుంది. అది కూడా ఇంటికి 100 మీటర్ల లోపే పైప్ అందుబాటులో ఉంటుంది. అయితే నీటి సరఫరా ఎంత అన్నది సీజన్‌ను బట్టి మారుతుంది. 2015 నాటి లెక్కల ప్రకారం 16.3 కోట్ల మంది భారతీయులకు సురక్షితమైన తాగునీరు లభించట్లేదని, ఈ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశమే మొదటి స్థానంలో ఉందని ఎన్‌జీఓ వాటర్ ఎయిడ్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించే ఈ కొత్త పథకం అమలులోకి వస్తే నీటి కరువుతో అల్లాడుతున్న 254 జిల్లాలకు ఉపశమనం లభించినట్టే.

  Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి


  ఇవి కూడా చదవండి:

  August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి

  New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారే 8 రూల్స్ ఇవే...

  Revolt: నెలకు రూ.2999 చెల్లించి ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు
  First published: