హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత ప్రధానిని పొగుడుతున్న ప్రపంచ మీడియా..

Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత ప్రధానిని పొగుడుతున్న ప్రపంచ మీడియా..

Photo Credit : Narendra Modi

Photo Credit : Narendra Modi

Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంతకీ మోదీ చేసిన ఆ వ్యాఖ్యలేంటి..?

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War)పై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ సంస్థ (SCO) సదస్సులో మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇది యుద్ధం చేయాల్సిన శకం కాదని చెబుతూ ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేయాల్సిందిగా పుతిన్‌కి మోదీ సున్నితంగా హితవుపలికారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి. యుద్ధంపై మోదీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కూడా ఇదే మొదటిసారి.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను భారత్ ఎన్నడూ సపోర్ట్ చేయడం లేదనే విషయాన్ని మోదీ మరొకసారి ప్రపంచానికి స్పష్టంగా చేశారు. చర్చలు, డిప్లమసీతో అంతర్జాతీయ వ్యవహారాలను చక్కబెట్టుకోవాలని, ఈరోజుల్లో యుద్ధాలు అసలు అవసరమే లేదని బహిరంగంగా పుతిన్‌కి మోదీ చెప్పడాన్ని ఇంటర్నేషనల్ వార్తా సంస్థలు తెగ పొగిడేస్తున్నాయి.

* మోదీపై ఇంటర్నేషనల్ మీడియా ప్రశంసల వర్షం

నిన్న మోదీ పుతిన్‌కు సుతిమెత్తగా అంటించిన చురకలను ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్లు ఫ్రెంట్ పేజీలో పబ్లిష్ చేశాయి. వాటిలో ఎక్కువ మంది ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బోల్డ్‌గా అభివర్ణిస్తూ పొగడ్తలతో ముంచెత్తాయి. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఇది సమయం కాదని, నేటి యుగం అసలు యుద్ధం చేయాల్సింది యుగం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడాన్ని అమెరికన్ ప్రధాన మీడియా పొగిడింది.

అమెరికన్ న్యూస్ మీడియా మోదీ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఆసక్తికర హెడ్‌లైన్స్‌తో కథనాలు ప్రచురించింది. "ఉక్రెయిన్‌లో యుద్ధంపై మోదీ పుతిన్‌ను మందలించారు" అని వాషింగ్టన్ పోస్ట్ హెడ్‌లైన్ స్టొరీ రాసింది. "అద్భుతమైన బహిరంగ మందలింపులో, మోదీ పుతిన్‌తో ఇలా అన్నారు: నేటి యుగం యుద్ధ యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్‌లో మాట్లాడాను" అని ది డైలీ హెడ్‌లైన్ రాసుకొచ్చింది.

* పుతిన్ ఏమన్నారంటే

SCO సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పుతిన్ బదిలిచ్చారు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారో తనకు తెలుసునని మోదీని ఉద్దేశిస్తూ పుతిన్ అన్నారు. ఈ వ్యవహారంలో మీరు ఎప్పటికప్పుడు వ్యక్తపరిచే మీ ఆందోళనల గురించి కూడా తనకు తెలుసన్నారు.

ఇది కూడా చదవండి : మోదీకి తెలంగాణ సీఎం బర్త్‌ డే విషెస్ .. దేశానికి మరింత సేవ చేయాలని కాంక్షించిన కేసీఆర్

"యుద్ధాన్ని వీలైనంత త్వరగా ఆపేందుకు మా వంతు కృషి చేస్తాం. దురదృష్టవశాత్తు ఉక్రెయిన్ నాయకత్వం చర్చల ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసింది. యుద్ధభూమిలో సైనిక చర్యల ద్వారా తన లక్ష్యాలను సాధించుకోవాలని తనకు ఉన్నట్లు ప్రకటించింది. ఏది ఏమైనా అక్కడ ఏం జరుగుతుందో ఎల్లప్పుడూ మీకు మేం తెలియజేస్తాం." అని పుతిన్ యుద్ధానికి దారితీసింది ఉక్రెయిన్ దేశమేనన్నట్లు చెప్పుకొచ్చారు.

ప్రపంచ దేశాలు రష్యాతో భారతదేశ సంబంధాన్ని, చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్‌లో యుద్ధంపై దేశం తీసుకున్న స్టాండ్‌ని గౌరవించాయి. అయితే ఇండియా మౌన ప్రేక్షకపాత్ర వహించకకుండా హింస వద్దని పదేపదే చెప్పుకొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ దేశాలు దౌత్యపరమైన, శాంతియుత చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Narendra Modi Birthday, PM Narendra Modi, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు