ప్రత్యక్ష పన్నుల్లో కీలక సంస్కరణలు.. కొత్త వేదికను ప్రారంభించిన ప్రధాని

ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పార‌దర్శ‌క ప‌న్నువిధానంలో ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌ను అతిపెద్ద సంస్క‌ర‌ణగా పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 13, 2020, 12:12 PM IST
ప్రత్యక్ష పన్నుల్లో కీలక సంస్కరణలు.. కొత్త వేదికను ప్రారంభించిన ప్రధాని
ప్రధాని మోదీ
  • Share this:
పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడంతో పాటు నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో కీలక సంస్కరణలను తెచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 'ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్ - హానరింగ్ ది హానెస్ట్ (పారదర్శక పన్ను విధానం-నిజాయితీపరులకు గౌరవం)' వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ఫేస్‌లెస్ అపీల్, ట్యాక్స్ పేయర్ చార్టర్ వంటి సంస్కరణలను తీసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. నిజాయితీ ప‌న్నుదారుల‌కు మ‌రింత సులువైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.

పార‌దర్శ‌క ప‌న్నువిధానంలో ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌ను అతిపెద్ద సంస్క‌ర‌ణగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌, ట్యాక్స్ పేయ‌ర్ చార్ట‌ర్‌లు నేటి నుంచే అమ‌లులోకి వ‌స్తాయని చెప్పారు. ఫేస్‌లెస్ అపీల్ సేవ‌లు మాత్రం సెప్టెంబ‌ర్ 25 నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు ప్రధాని మోదీ. పన్నుదారులు ఇబ్బందులు పడకుండా, నేరుగా హాజ‌రు కాకుండా ఉండే విధంగా త‌యారు చేసినట్లు వెల్లడించారు. స‌క్ర‌మంగా ప‌న్నులు చెల్లిస్తున్న‌వారిని మ‌రింత ప్రోత్స‌హిస్తామ‌ని అన్నారు. ప్ర‌తి నియ‌మాన్ని క‌చ్చితంగా అమ‌లు చేస్తామని.. గతంలో ఒత్తిడిలో కొన్ని నిర్ణ‌యాలు తీసుకునేవారని, అలాంటి వాటితో ల‌క్ష్యాల‌ను చేరుకోలేమ‌ని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ.


ప‌న్ను విధానాన్ని సరళతరం చేసి, చెల్లింపుదారులను మ‌రింత శ‌క్తివంతంగా త‌యారు చేయ‌డ‌మే ప్ర‌ధాని మోదీ ల‌క్ష్య‌మ‌ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ప‌న్న‌విధానంలో పార‌ద‌ర్శ‌క‌త ఉండాల‌ని, నిజాయితీప‌రుడైన ప‌న్నుదారుల్ని గౌర‌వించాల‌న్న‌దే తమ ఉద్దేశ్యమని చెప్పారు.


పారదర్శక పన్ను విధానం-నిజాయితీపరులకు గౌరవం వేదిక ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారమన్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదాయపు పన్ను విభాగం అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్లు, ట్రేడ్ అసోసియేషన్లు, వివిధ వాణిజ్య మండలితో పాటు ప్రముఖ చెల్లింపుదారులు కూడా వీక్షించారు.

పన్నుల చెల్లింపునకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ - ఇన్ కమ్ ట్యాక్స్ (CBDT) ఇటీవల ఎన్నో సంస్కరణలను తెచ్చింది. గత ఏడాది కార్పొరేట్ ట్యక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అంతేకాదు నూతన తయారీ యూనిట్లకు ఈ రేటును 15 శాతానికి తగ్గించారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌‌ను కూడా తొలగించారు. పన్ను విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు ఇప్పుడీ కొత్త వేదికను ప్రారంభిస్తున్నారు
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading