PRIME MINISTER NARENDRA MODI IS CHAIRING A MEETING OF THE UNION COUNCIL OF MINISTERS SSR
PM Modi: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో ప్రధాని సమావేశం.. మోదీ చెప్పిందొకటే.. అదేంటంటే..
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
ప్రభుత్వంలో అన్ని శాఖలు సమన్వయంగా కలిసికట్టుగా ఈ ఉపద్రవం కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన మంత్రులకు సూచించారు. అంతేకాదు, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు ప్రజలకు...
న్యూఢిల్లీ: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా చోటుచేసుకున్న పరిస్థితులపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులకు ప్రధాని కీలక సూచన చేశారు. ప్రభుత్వంలో అన్ని శాఖలు సమన్వయంగా కలిసికట్టుగా ఈ ఉపద్రవం కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన మంత్రులకు సూచించారు. అంతేకాదు, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు ప్రజలకు అందుబాటులో ఉండి, అవసరమైన సాయాన్ని అందించాలని ఆదేశించారు. స్థానికంగా ప్రజలు కరోనా మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రధాన మోదీ మంత్రులకు స్పష్టం చేశారు. మే 1 నుంచి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ మొదలుకానుండటంతో.. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ప్రధాని మంత్రులతో చర్చించారు. ఇదిలా ఉంటే.. దేశంలో గత 14 రోజులుగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, ఒడిశాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలిపింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గర్, రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు పేర్కొంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆక్సిజన్ లభ్యత గురించి ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని, 23 రాష్ట్రాలకు 8,593 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సప్లయ్ చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ వినియోగంపై ఆడిట్ జరపాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. కోవిడ్-19 బాధితులకు యాంటీబయాటిక్ రెమిడిసివిర్ ఇంజక్షన్‌ను వైద్య నిపుణులు మాత్రమే ఇవ్వాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సూచించారు. ఇదిలా ఉంటే.. కరోనా సోకి హోం ఐసోలేషన్ పాటిస్తున్న వ్యక్తి ఎన్ని రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలన్న దానిపై కూడా ఎయిమ్స్ డైరెక్టర్ స్పష్టతనిచ్చారు.
లక్షణాలు కనిపించి.. చికిత్స తీసుకున్న పది రోజుల తర్వాత.. అది కూడా సెల్ఫ్ క్వారంటైన్ పాటించనక్కర్లేదని భావించే మూడు రోజుల ముందు ఎలాంటి జ్వరం, లక్షణాలు లేకపోతేనే హోం ఐసోలేషన్ నుంచి బయటకు రావాలని ఆయన చెప్పారు. హోం ఐసోలేషన్ నుంచి బయటికొచ్చి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లయితే మళ్లీ కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.