శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో దీపావళి(Diwali) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా దిపావళి సందర్బంగా నిర్వహించే దీపోత్సవ్(Deepotsav)కార్యక్రమానికి ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)హాజరయ్యారు. సుమారు 18లక్షల మట్టి ప్రమిదలను అయోధ్య(Ayodhya)మందిరం ప్రాంగణంతో పాటు సరయు నది(Sarayu River)తీరంలో దీపాలను వెలిగించారు. ఆరేళ్లుగా నిర్వహిస్తున్న ఈ మహత్తరమైన కార్యక్రమానికి ప్రధాని రావడంతో అయోధ్య నగరాన్ని అత్యద్భుతంగా అలంకరించారు.
దేదీప్యమానంగా దీపోత్సవ్..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం దీపోత్సవ్ వేడుకతో యావత్ ప్రపంచానికే వెలుగులను పంచింది. ఆరేళ్లుగా నిర్వహిస్తున్న దీపోత్సవ వేడుకలకు ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీపోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకొని శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 5.45 గంటలకు రాజ్యాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6.30 గంటలకు సరయు నది ఒడ్డున నదికి హారతి ఇచ్చి దీపోత్సవ్ వేడుకలు ప్రారంభించారు.
May the divine blessings of Bhagwaan Shree Ram brighten our lives. Watch from Ayodhya... https://t.co/Hr2nVF2G2u
— Narendra Modi (@narendramodi) October 23, 2022
18లక్షల ప్రమిదల వెలుగులు..
దీపోత్సవ్ వేడుకల్లో భాగంగా బాణసంచా, లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో, రామ్ లీలా వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సరయు నది ఒడ్డున రామ్ కి పైడి వద్ద 22వేల మందికిపైగా వాలంటీర్లు 15లక్షలకుపైగా దీపాలను ఒకేసారి వెలిగించారు. వివిధ దేశాలకు చెందిన కళాకారులు ప్రధాని మోదీ సమక్షంలో రామ్‌లీలాను ప్రదర్శించారు. దీపోత్సవ వేడుకల్లో భాగంగా మోదీ శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేయడంతోపాటు సీతారాములకి, లక్ష్మణుడికి హారతి ఇచ్చారు. అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని పరిశీలించిన ప్రధాని వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటే సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో దాదాపు రూ.4వేల కోట్ల విలువైన పథకాలకు శ్రీకారం చుట్టారు.
శ్రీరాముని పుణ్యస్తలంలో ..
ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో ఈరోజు 18 లక్షల దీపాల వెలుగుల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. రామ్ కి పైడి' పేరుతో జరగనున్న 3D హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. అలాగే భగవాన్ శ్రీ రామ్‌లాలా విరాజ్మాన్ దర్శనం చేసుకున్నారు. ఆపై పూజను కూడా నిర్వహిస్తారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని మోదీ ఈ సందర్భంగా పరిశీంచారు.
కొనసాగుతున్న దీపావళి వేడుకలు..
దీపావళికి స్వాగతం పలుకుతూ అయోధ్య నగరంలో 18 లక్షలకుపైగా దీపాలు వెలిగించడంతో అఖండ దీపాల మధ్య శ్రీరాముని పుణ్యస్తలంగా అత్యద్భుతంగా కనిపించింది.14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకున్న అనంతరం అయోధ్య రాముల వారు రాజ్యానికి తిరిగొచ్చిన ఘట్టం నేపథ్యంలో జరిగే పండగ కావడంతో అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరాన్నంటుతునున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Diwali 2022, Narendra modi