Home /News /national /

PRIME MINISTER NARENDRA MODI HAS SET THE CAT AMONG THE PIGEONS WITH HIS FUSILLADE AGAINST ELECTION FREEBIES UMG GH

Election Freebies: ఎన్నికల్లో ఉచితాలతో వ్యవస్థలకు, దేశానికి ప్రమాదం.. వీటికి చెక్ పెట్టడం ఎలా..?

ఎన్నికల్లో ఉచితాలతో వ్యవస్థలకు, దేశానికి ప్రమాదం.. వీటికి చెక్ పెట్టడం ఎలా..?

ఎన్నికల్లో ఉచితాలతో వ్యవస్థలకు, దేశానికి ప్రమాదం.. వీటికి చెక్ పెట్టడం ఎలా..?

ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ఉచితాలు ఇస్తామంటూ హామీలు ఇవ్వడాన్ని ఇటీవల తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉచిత వాగ్దానాలు చేసి ఓట్లు దండుకునే సంస్కృతి దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా యువతను హెచ్చరించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ఉచితాలు ఇస్తామంటూ హామీలు ఇవ్వడాన్ని ఇటీవల తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉచిత వాగ్దానాలు చేసి ఓట్లు దండుకునే సంస్కృతి దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా యువతను హెచ్చరించారు. ఉచిత హామీలు ఇచ్చేవారు దేశ భవిష్యత్తుకు భద్రత, భరోసా ఇచ్చే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేరని వ్యాఖ్యానించారు.

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవం సందర్బంగా మోదీ చేసిన ఆ ప్రసంగం.. ప్రజలే ముఖ్యం, ఉన్నత వర్గాలకు వ్యతిరేకం అనే భావనను పెంచే పాపులిజాన్ని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఈ ప్రసంగం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే ప్రజలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న ఆయన వాగ్దానం వల్ల రాష్ట్రానికి ఏడాదికి రూ.8700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇటువంటి విధానాల వల్లనే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు సంవత్సరాల తరబడి ఏకంగా రూ. 2,40,710 కోట్లకు చేరుకున్నాయి. అటువంటి రంగంలో ఎవరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? ఇంకా ముఖ్యంగా గృహ విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ఇచ్చే ఇలాంటి విధానాల కారణంగా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అందించే విద్యుత్ ధరలను పెంచాల్సి ఉంటుంది. ఇది ఆయా రంగాల్లో పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది. 2019లో విద్యుత్ సరఫరా నాణ్యతపై OECD నివేదిక.. మొత్తం 141 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశానికి 108వ ర్యాంక్ ఇచ్చింది.

ఉచిత విద్యుత్ హామీ మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వివిధ రకాల ఉచితాలు దేశ విపత్తుకు కారణం కావచ్చు. విచ్చలవిడిగా ఎరువుల సబ్సిడీలు ఇచ్చే విధానంతో భూసారం ఎలా ప్రభావితం అవుతోందో మనం చూశాం. ఇటీవలి ఎన్నికలలో ఉచిత ల్యాప్‌టాప్‌లు, టీవీ సెట్‌లు, మంగళసూత్రాలు, మేకలు, గొర్రెల వాగ్దానాలు వంటి అబంబద్ద ఉచితాలు వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి.ఉచితాలపై ప్రధాని చేసిన హెచ్చరికపై కేజ్రీవాల్ ప్రతిస్పందిస్తూ.. ఉచిత విద్య, ఆరోగ్య సేవలు ఉచితాలు కాదని, ఢిల్లీ బడ్జెట్‌తో ఉచిత విద్యుత్‌ను ఇవ్వగలమని వ్యాఖ్యానించారు. ఇక్కడ వాదన ఏమిటంటే, ఒక రాష్ట్రం భరించగలిగితే, సబ్సిడీలు ఇవ్వడం వల్ల నష్టమేమీ లేదు. కానీ దీనివల్ల ఆపర్చునిటీ కాస్ట్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇతర అవసరాల కోసం కేటాయించాల్సిన ఆపర్చునిటీ కాస్ట్ అనేది రాయితీలుగా ఇచ్చే నిధులకు కేటాయించాల్సి వస్తుంది. అందుకే ఉచితాలను పంపిణీ చేసిన వారు ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించలేదని ప్రధాని చెబుతూ, ఈ ఆపర్చునిటీ కాస్ట్ గురించి ప్రస్తావించారు.

సరళంగా చెప్పాలంటే, మౌలిక సదుపాయాల వృద్ధి లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదు. బలమైన వృద్ధిని సాధించిన తూర్పు ఆసియా దేశాలను పరిశీలిస్తే.. ఆ దేశాల వృద్ధి మార్గంలో GDP పెరగడం అనేది పెట్టుబడులు పెరగడంపై ఆధారపడినట్లు తెలుస్తోంది. గతంలో జపాన్, దక్షిణ కొరియాలో, ఇప్పుడు చైనా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే పెట్టుబడులు, దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాల వృద్ధి చాలా ముఖ్యం.

అయితే ప్రజలకు సామాజిక భద్రతను అందించే కొన్ని అంశాలను ఉచితాలుగా చెప్పలేం. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, శిక్షణ కార్యక్రమాలపై ఖర్చు చేయడం.. వంటివి హ్యూమన్ క్యాపిటల్‌ను నిర్మించడంలో సహాయపడతాయి. ఉపాది, పరిశ్రమల వృద్ధిని పెంచే ఇలాంటివేవీ ఉచితాలు కావు. మరోవైపు నిరుపేదలకు ప్రభుత్వ మద్దతు ఎల్లప్పుడూ అవసరం. అయితే వీటన్నింటికీ ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. వివిధ వర్గాల నుంచి వచ్చే డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం నిర్వహించలేక పోయినప్పుడు సమస్య ఉత్పన్నమవుతుంది, ఫలితంగా ఆర్థిక లోటు పెరుగుతుంది.

దక్షిణాసియాలో శ్రీలంక రూపంలో ఇప్పటికే పాపులిజం ప్రమాదాల గురించి భయానక ఉదాహరణ ఉంది. దీనికి సంబంధించిన వార్నింగ్ సైన్స్ చాలా కాలం క్రితం నుంచే స్పష్టంగా ఉన్నాయి. 2005లో IMF వెల్లడించిన నివేదిక కొన్ని వివరాలు వెల్లడించింది. 'గత 25 ఏళ్లలో శ్రీలంక కంటే చాలా తక్కువ దేశాలు సగటు ద్రవ్య లోటును కలిగి ఉన్నాయి. అధిక లోటు ప్రభుత్వ రుణ స్థాయిని GDPలో 100 శాతానికి పైగా పెంచింది. అధిక పన్నుల అంచనాలను పెంచడం, స్థూల ఆర్థిక నష్టాలను పెంచడం ద్వారా ప్రైవేట్ పెట్టుబడులకు ఆటంకం కలిగించాయి. ప్రభుత్వ బడ్జెట్‌లో వడ్డీ చెల్లింపులు అతిపెద్ద వ్యయ అంశంగా మారాయి. ఇవన్నీ ప్రభుత్వ పెట్టుబడిపై ఒత్తిడి పెంచాయి.’ అని నివేదిక అప్పట్లో పేర్కొంది.

భారతదేశంలో శ్రీలంక లాంటి పరిస్థితులు లేవు. కానీ భారతదేశ ప్రభుత్వ రుణ భారం గణనీయంగా పెరిగిందని, ఇది GDPలో 91 శాతం వద్ద స్టెబిలైజ్డ్‌గా ఉందని మూడీస్ గత సంవత్సరం అంచనా వేసింది. Baa రేటింగ్ ఉన్న ఇతర దేశాలకు ఇది 48 శాతం వద్ద, మధ్యస్థ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆదాయంలో వడ్డీ చెల్లింపులు 26 శాతంగా ఉన్నాయని, ఇది Baa రేటెడ్ వ్యవస్థల్లో అత్యధికమని పేర్కొంది. బలహీనమైన ఆర్థిక పరిస్థితి భారతదేశ క్రెడిట్ రేటింగ్‌ను వెనక్కి నెట్టివేస్తోంది.

ఎన్నికల వాగ్దానాల ప్రభావం గురించి కోర్టులతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా ఆందోళన చెందుతున్నాయి. సమస్య పరిష్కారానికి మార్గాలను సూచించడానికి ఎన్నికల సంఘం, RBI, ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, రాజకీయ పార్టీల సభ్యులతో ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల నిర్ణయించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్నట్లుగా ప్రతి పోల్ వాగ్దానాల ఖర్చును గణించడం, దానిని ప్రచారం చేయడం దీనికి ఒక మార్గం. ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ & రీసెర్చ్ (IGIDR) ప్రొఫెసర్ ఎస్ చంద్రశేఖర్ ఈ విషయంపై స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాలకు ఎలా నిధులు సమకూరుస్తాయో వివరణ ఇవ్వాలని, లెక్కలు చెప్పాలని తెలిపారు. .

అయితే ఇలాంటి చర్యలు సమాఖ్య, ప్రజాస్వామ్య విధానాలు అవలంభించే భారత్‌లో పని చేస్తాయా? అనేది ప్రశ్నార్థకం. భారతదేశంలో బాధ్యతారహితమైన రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు, నిపుణుల బృందం చేసే ఏవైనా సిఫారసులను వ్యతిరేకించవచ్చు. ఉచితాల ఖర్చులు, వాటి నిధుల గురించి పార్టీలు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉన్నప్పటికీ, గణాంకాల విషయంలో మోసగించకుండా నిరోధించడం అనేది మరో పెద్ద అవరోధం.

ఎన్నికల్లో ఉచితాలు అనే అంశం నిరంతర చర్చగా, చర్చనీయాంశంగా ఉండాలి. తద్వారా రాష్ట్ర బడ్జెట్‌లో ఒక శాతంగా ఉచితాలను పరిమితం చేసే ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని అంగీకరించేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి ఉంటుంది. ఇటీవలి కాలంలో అనేక వివాదాస్పద అంశాలపై మనం పురోగతి సాధించాం. రాష్ట్రాలకు సంబంధించిన FRBM నిబంధనలు, GST, ప్రైవేటీకరణ, కార్మిక చట్టాలు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఇంధన సబ్సిడీని వదిలించుకోవడమే కాకుండా, నిరసనల మధ్యలోనే ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచగలిగాం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందాం. ప్రజాస్వామ్యంలో సంస్కరణ ప్రక్రియ నెమ్మదిగా ఉండవచ్చు, కానీ దీనికి ఎక్కువ చట్టబద్ధత కూడా ఉంది.
Published by:Mahesh
First published:

Tags: Bjp, Elections, Modi, Vote

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు