భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కొత్త ప్రతిపాధన చేశారు. దేశంలో ఉన్న పోలీసు యంత్రాంగం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు యూనిఫాంలు ధరించడంపై ఆయన శుక్రవారం రాష్ట్రాల హోం మంత్రులతో జరిగిన చింతన్ శిభిర్లో ప్రస్తావనకు తెచ్చారు. దేశ వ్యాప్తంగా పోలీసు శాఖ(Police Department)లో పని చేస్తున్న వారందరికి ఒకే టైపు యూనిఫాం ఉండాలనే తన అభిమతాన్ని వ్యక్త పరిచారు.అందుకోసం వన్ నేషన్ వన్ యూనిఫాం(One nation One uniform)ను ప్రతిపాధించారు ప్రధాని మోదీ. అయితే తన ప్రతిపాధన ఇప్పటికిప్పుడు అమలు కాకపోయినా త్వరలో ఆచరణలోకి వస్తుందనే చెప్పినట్లుగా ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. వన్ నేషన్ వన్ యూనిఫాం పోలీసులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు చట్ట అమలుకు సాధారణ గుర్తింపు(Common Identity)ని కూడా అందిస్తుందన్నారు మోదీ.
ఇండియాలోనే ఎందుకిలా..?
భారతదేశంలో భిన్న ప్రాంతాలు. భిన్నమైన సంప్రదాయాలు కలవు. అయితే దేశంలో శాంతిభద్రతల్ని పరిరక్షణ కోసం పని చేస్తున్న పోలీసుశాఖలో సిబ్బంది మాత్రం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు యూనిఫాంలు ధరించడంపై ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఏ ఏ రాష్ట్రంలోని పోలీసు బలగాలు, వ్యక్తిగత భద్రత సిబ్బంది ధరించే యూనిఫాంలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే మెజారిటీ పోలీసులు ఖాకీ రంగు దుస్తులను ధరించినప్పటికీ ..కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో యూనిఫాంలలో అసమానతలు ఉన్నాయి. ఇదే విషయంపై మోదీ రాష్ట్ర హోంమంత్రుల తొలి సమావేశంలో చర్చించారు. ఈవిధంగా వేర్వేరుగా కాకుండా దేశంలోని పోలీసులంతా ఒకే యూనిఫాం ధరిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
1954 में तत्कालीन राष्ट्रपति महोदय द्वारा दिल्ली पुलिस को इंडिया गेट अंकित "कलर्स" से सम्मानित किया गया था। दिल्ली पुलिस के 75वें स्थापना दिवस पर इस सम्मान की स्मृति में इसे पुलिस ड्रेस कोड का हिस्सा बनाया गया है।(1/2)@ANI@PTI_News pic.twitter.com/hVqg5alct2
— Delhi Police (@DelhiPolice) February 17, 2022
Recent alterations in police uniforms
రాబోయే రోజుల్లో అంతటా ఒకే యూనిఫాం..
ప్రధాని మోదీ చింతన్ శిభిర్లో ఈ విషయంపై అన్నీ రాష్ట్రాలు ఆలోచించాలని సూచించారు. వన్ నేషన్ వన్ యూనిఫాం అనేది ఇబ్బందికరంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాదన్నారు. ఆలోచిస్తే దాని వల్ల ప్రయోజనాలు అర్ధమవుతాయని తెలిపినట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచూరించింది. ఇప్పటికిప్పుడు జరగకపోయినా రాబోయే 5 నుంచి 50ఏళ్లలోపు సాధ్యపడుతుందన్నారు. అలాగే నాణ్యమైన ఉత్పత్తులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒకే సాధారణ గుర్తింపు ఉంటుందన్నారు.
బ్రిటీష్ కాలం నాటి ఖాకీ రంగు ..
బ్రిటీష్ కాలం నాటి ఖాకీ పోలీస్ యూనిఫాంనే ప్రస్తుతం దేశంలోని ఎక్కువ శాతం మంది పోలీసులు ధరిస్తున్నారు. అయితే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం యూనిఫాం రంగులు, యూనిఫాం డిజైన్స్ మారుస్తూ వస్తున్నారు.
పోలీసు యూనిఫాంల చరిత్ర..
బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు పోలీసు సిబ్బంది తెల్లటి యూనిఫాం ధరించేవారు. అయితే దుమ్ము, దూళితో పాటు బురద కారణంగా తెల్లటి యూనిఫాం మురికిగా మారుతోందని గుర్తించారు. యూనిఫార్మర్ వెబ్సైట్ ప్రకారం వారి యూనిఫాంలు మురికి కాకుండా ఉండేందుకు పోలీసు అధికారులు వాటిని రకరకాల రంగులలో వేయడం ప్రారంభించారు. అది కాస్తా కాలక్రమేణ రంగు, రంగుల యూనిఫామ్‌లకు దారి తీసింది. 1847లో సర్ హెన్రీ లారెన్స్ రంగు యొక్క ప్రయోజనాలను గుర్తించిన తర్వాత ఖాకీని పోలీసు యూనిఫారానికి అధికారిక రంగుగా ఎంపిక చేశారు. ఇది చాలా ముదురు రంగు కాదు మరియు దుస్తులపై మురికిని సులభంగా దాచిపెడుతుంది. అప్పటి నుంచి దేశంలోని పోలీసులు ఖాకీ రంగు యూనిఫామ్‌లు ధరిస్తున్నారు.
భారత్‌లో పోలీస్ యూనిఫాంలను నిర్ణయించేదెవరూ..?
రాజ్యాంగం ప్రకారం లా అండ్ ఆర్డర్ అనేది భారతదేశంలో ఒక రాష్ట్ర అంశం. అందువల్ల యూనిఫాంలు, పోలీసింగ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై నిర్ణయాలు ఆ రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల క్రిందకు వస్తాయి.రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లోని జాబితా II(స్టేట్ లిస్ట్) 'పబ్లిక్ ఆర్డర్‌తో పాటు పోలీస్ ఉద్యోగాలు , పదోన్నతులను రాష్ట్రాల మధ్య అధికారాల విభజనతో వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వ్యక్తిగత పోలీసు దళం కూడా వారి సిబ్బంది ధరించే యూనిఫామ్‌పై కాల్ తీసుకోవచ్చనే విషయాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ ఆర్టికల్‌లో పేర్కొంది.
రాష్ట్రాలలో వేర్వేరు యూనిఫారాలు..
పోలీసులు ధరించే అధికారిక దుస్తులు రాష్ట్రాలలో మారుతూ ఉంటాయి. చాలా మంది సిబ్బంది ఖాకీ యూనిఫామ్‌లను ధరిస్తారు. రాష్ట్రాల్లో ఉండే వారంతా ఒకే యూనిఫాం వేసుకున్నప్పటికి దేశ వ్యాప్తంగా చూసుకుంటే అనేక షేడ్స్‌లో ఉంటాయి. కొంతమంది రాష్ట్ర పోలీసులు కూడా తెల్లని దుస్తులు ధరిస్తారు. కోల్‌కతా పోలీసులు తెల్లటి యూనిఫాం ధరిస్తారు. కాని పశ్చిమ బెంగాల్ పోలీసులు మాత్రం ఖాకీ రంగు దుస్తులు వేసుకుంటారు.
డీజీపీ నిర్ణయం ..
ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్ర డిజిపి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ల (PSI)స్థాయి నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ (Dy SP)వరకు ‘ట్యూనిక్ యూనిఫాం’ను నిలిపివేస్తూ నోటీసు జారీ చేశారు. ట్యూనిక్ యూనిఫాం అసౌకర్యంతో పాటు ఖరీదైనది ఆర్డర్‌కు కారణాలుగా డిజిపి పేర్కొన్నారు. బ్రిటీష్ పోలీసు అధికారులు సాంప్రదాయకంగా ధరించేవారు. కాని ట్యూనిక్ యూనిఫాం అనేది ఖాకీ టెర్రీ ఓవర్ కోట్.ఇది పోలీసు సిబ్బంది సంప్రదాయ యూనిఫాం మీద ధరిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, National News, Police