హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన ప్రధాని మోదీ..

PM Modi: వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన ప్రధాని మోదీ..

కచ్చితంగా అవసరమైతే తప్ప కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులందరూ కనీసం ఆగస్టు 15 వరకు ఢిల్లీలోనే ఉండాలని సూచించారు.

కచ్చితంగా అవసరమైతే తప్ప కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులందరూ కనీసం ఆగస్టు 15 వరకు ఢిల్లీలోనే ఉండాలని సూచించారు.

PM Modi: ఇటీవల యాస్ తుఫాను ఎంత తీవ్రంగా కల్లోలం స్పష్టించిందో తెలిసిందే. తుఫాను కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని తన సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  యాస్ తుఫాన్ బాధితుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంఘీభావం తెలిపారు. ఈ ప్ర‌కృతి విప‌త్తులో త‌మ వాళ్ల‌ను కోల్పోయిన కుటుంబాల దుస్థితిపై ఆయ‌న తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. అదేవిధంగా యాస్ తుఫాన్ ప్ర‌భావంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ప్రకటించారు. అంతేకాకుండా గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని కార్యాల‌యం మీడియాకు వెల్ల‌డించింది. తుఫాన్ కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సాయం ప్ర‌క‌టించిన‌ట్లు వివ‌రించింది. అదేవిధంగా త‌క్ష‌ణ ఆర్థిక సాయం కింద తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల‌కు ప్ర‌ధాని మోదీ రూ.1000 కోట్లు ప్ర‌క‌టించార‌ని ప్ర‌ధాని కార్యాల‌యం వెల్ల‌డించింది.

  సైక్లోన్ ఎఫెక్ట్  (ఫైల్)

  సైక్లోన్ ఎఫెక్ట్ (ఫైల్)

  అందులో రూ.500 కోట్లు ఒడిశా రాష్ట్రానికి, మ‌రో రూ.500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప‌శ్చిమ‌బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు కేటాయించిన‌ట్లు తెలిపింది. యాస్ తుఫానుతో కలిగిన నష్టాన్ని సమీక్షించి, స్వయంగా అంచనా వేసేందుకు ప్రధాని మోదీ శుక్రవారం ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో పర్యటన సాగించారు. బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలతో పరిస్థితిని మోదీ సమీక్షించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Cyclone Yaas, Odisha, Pm modi, West Bengal

  ఉత్తమ కథలు