PRIME MINISTER NARENDRA MODI CONGRATULATES SHINDE AND FADNAVIS ON BECOMING CM AND DEPUTY CM PVN
PM Modi : షిండే,ఫడ్నవీస్ కి మోదీ కంగ్రాట్స్..ఆ నమ్మకం తనకుందన్న ప్రధాని
ఫైల్ ఫొటో
Modi congratulates Shinde And Fadnavis:నాటకీయ పరిణామాల అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్త స్థాయి నుంచి నుంచి సీఎంగా ఎదిగిన షిండేను మోడీ అభినందించారు.
Modi congratulates Shinde And Fadnavis : నాటకీయ పరిణామాల అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharshtra CM)గా గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండే(Eknath Shinde)కు ప్రధాని మోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్త స్థాయి నుంచి నుంచి సీఎంగా ఎదిగిన షిండేను మోడీ అభినందించారు. అతను తనతో గొప్ప రాజకీయ, శాసన మరియు పరిపాలనా అనుభవంతో మహారాష్టను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఆయన కృషి చేస్తారన్న నమ్మకం నాకుంది అని ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు. మోదీ మరో ట్వీట్ లో..మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఫడ్నవీస్ ప్రతీ బీజేపీ కార్యకర్తకు స్పూర్తి అని కొనియాడారు. ఫడ్నవీస్ అనుభవం, నైపుణ్యం ప్రభుత్వానికి ఆస్తి అని అభివర్ణించారు. అతను మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాడని మోదీ అభిప్రాయపడ్డారు.
ఏక్ నాథ్ షిండే,దేవేంద్ర ఫడ్నవీస్ లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు షా ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పని చేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు షా ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడంపై నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) స్పందించారు. గురువారం రాత్రి మీడియాతో పవార్ మాట్లాడుతూ..."ఏక్నాథ్ షిండే కొత్త బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్ద సంఖ్యలో శివసేన ఎమ్మెల్యేలను గౌహతికి తీసుకెళ్లి సత్తా చూపించాడు. శివసేన నుంచి బయటకు వచ్చేలా ప్రజలను ప్రేరేపించాడు. ప్రిపరేషన్ లేకుండా ఇది జరగలేదు. నేను ఏకనాథ్ షిండేతో మాట్లాడి నా శుభాకాంక్షలు తెలియజేసాను. ఒక రాష్ట్రానికి అధిపతి ఒక పార్టీకి మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రానికి నాయకత్వం వహించాలనే నా అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసాను. షిండే పార్టీకి ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి అన్ని శాఖల సమస్యలను పరిష్కరించడానికి ఆయన కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఉద్ధవ్ ఠాక్రే ఎవరినైనా విశ్వసించిన తర్వాత పూర్తి బాధ్యత వారికి అప్పగిస్తారని నేను భావిస్తున్నాను. ఏకనాథ్ షిండేపై అదే నమ్మకాన్ని చూపి ఆయనకు విధానసభ బాధ్యతలు, పార్టీ బాధ్యతలు అప్పగించారు. అది (రాజకీయ సంక్షోభం) దాని ఫలితమేమో నాకు తెలియదు. దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం నంబర్ 2 పదవిని సంతోషంగా అంగీకరించాడని నేను అనుకోను. అది అతని ముఖంలో కనిపిస్తుంది. కానీ అతను నాగ్‌పూర్‌లో నివసించాడు, అది (RSS)గడ్డ. స్వయంసేవక్‌గా అతని బాధ్యత కాబట్టి అతను ఆ పదవిని అంగీకరించాడు"అని అన్నారు.
షిండేను సీఎంగా ప్రకటించిన ఫడ్నవీస్, ప్రభుత్వంలో తాను భాగం కావడం లేదని చెప్పిన విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడితో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. షిండేతో కలిసి అస్సాంలోని గౌహతికి వెళ్లిన వారంతా కూడా ఆయనతో సహా డిప్యూటీ సీఎం పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారని శరద్ పవార్ తెలిపారు. అయితే బీజేపీ ఏకంగా సీఎం పదవిని ఆఫర్ చేస్తుందని షిండే అయినా ఊహించి ఉండరని అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.