హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

News18 కృషిని అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

News18 కృషిని అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధాని మోదీ, జగదీప్ ధన్కర్ (images credit - twitter)

ప్రధాని మోదీ, జగదీప్ ధన్కర్ (images credit - twitter)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. న్యూస్18 చేస్తున్న ప్రయత్నాల్ని మెచ్చుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు.. దేశ ప్రజలపై మంచి ప్రభావం చూపిస్తాయని అన్నారు. ఇంతకీ ప్రధాని మోదీ ఎందుకలా మెచ్చుకున్నారో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. న్యూస్18 చేస్తున్న కృషిని అభినందించారు. తాను చేపట్టిన మన్‌ కీ బాత్ (MannKiBaat) రేడియో కార్యక్రమం.. క్షేత్రస్థాయిలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారిని గుర్తించి.. సెలబ్రేట్ చేస్తోందనీ.. అది ఈ కార్యక్రమంలో అందమైన విషయం అని ప్రధాని మోదీ అన్నారు. ఏప్రిల్ చివరి ఎపిసోడ్‌తో మన్ కీ బాత్.. వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో... CNNన్యూస్18 చేపట్టిన ప్రయత్నాల్ని తాను మెచ్చుకుంటున్నానని ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

మార్చి 29, 30 తేదీల్లో న్యూఢిల్లీలో.. న్యూస్18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా.. న్యూస్18 రూపొందించిన "వాయిస్ ఆఫ్ ఇండియా - మోదీ, మార్పు తెప్పిస్తున్న మన్ కీ బాత్" అనే కాఫీ టేబుల్ బుక్‌ని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రారంభించారు. ఈ బుక్‌లో మన్ కీ బాత్ ఎపిసోడ్స్, దేశంలో క్షేత్ర స్థాయిలో ప్రభావితం చేసిన వ్యక్తుల వివరాలు ఉన్నాయి. దీన్ని రూపొందించి, రిలీజ్ చేయించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తన ట్వీట్‌లో పుస్తక రిలీజ్ ట్వీట్‌ని రీట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్ ఇక్కడ చూడండి

ఏప్రిల్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ రానుంది. 2014 నుంచి ప్రతీ నెలా చివరి ఆదివారం మోదీ.. మన్ కీ బాత్ ప్రసంగం చేస్తున్నారు. అందులో దేశంలో వస్తున్న మార్పులు, క్షేత్రస్థాయిలో వివిధ వ్యక్తులు సాధిస్తున్న విజయాలు, చూపిస్తున్న ప్రభావాల్ని చెబుతున్నారు. ఈ విషయాల్ని న్యూస్18 పుస్తక రూపం తెచ్చింది.

First published:

Tags: CNN-NEWS18, Narendra modi

ఉత్తమ కథలు