హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rajinikanth-PM Narendra Modi: రజినీకాంత్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ..

Rajinikanth-PM Narendra Modi: రజినీకాంత్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ..

రజినీకాంత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన పీఎం నరేంద్ర మోదీ (File/Photo)

రజినీకాంత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన పీఎం నరేంద్ర మోదీ (File/Photo)

Rajinikanth-PM Narendra Modi: ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు.  ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు.

ఇంకా చదవండి ...

Rajinikanth-PM Narendra Modi: ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు.  ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. మీరు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలంటూ ప్రధాని ట్వీట్ చేసారు.ముందు నుంచి కూడా రజినీకాంత్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంచి స్నేహం ఉంది. ఈయన కారణంగానే రజినీ బిజేపీలోకి వస్తాడనే వార్తలు కూడా చాలా రోజులుగా వినిపించాయి. కానీ ఈయన ఈ నెల 31న నూతన సంవత్సర  కానుకగా కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు తమిళనాడులో ద్రవిడ నాస్తిక రాజకీయాలు కాకుండా... తన పార్టీతో ఆధ్యాత్మిక రాజకీయాలకు కొత్త పునాది వేస్తున్నట్టు ప్రకటించారు.

అంతేకాదు తమిళనాట ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.  ఇక తమిళనాడుకు వచ్చే యేడాది మే లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రజినీకాంత్ సొంతంగా తమిళనాడు ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండా బరిలో దిగబోతున్నట్టు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అప్పట్లో తమిళనాడుకు మోదీ వచ్చినపుడు కూడా ప్రత్యేకంగా రజినీకాంత్‌ను ఇంటికి వెళ్లి మరీ కలిసారు. ఆ తర్వాత బిజేపీకి సపోర్ట్ చేయాలంటూ రజినీకాంత్‌ను మోదీ కోరారు కూడా. దీనికి ఆయన నుంచి సమాధానం నో అనే వచ్చింది అది వేరే విషయం. కానీ మోదీ అంటే రజినీకాంత్ కూడా ఇష్టపడుతుంటాడు.

ఆయనంటే అభిమానిస్తుంటాడు. మోదీ చేస్తున్న పనులు అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పటిక పలు సందర్భాల్లో చెప్పాడు కూడా. సూపర్ స్టార్ అంటే మోదీకి కూడా ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇక కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రజినీకాంత్‌ను దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: Kollywood, National, PM Narendra Modi, Rajinikanth, Tollywood

ఉత్తమ కథలు