Home /News /national /

PRIME MINISTER NARENDRA MODI AS A STRONG LEADER CONGRESS TACTICS THAT DO NOT WORK IN CONFRONTING MODI GH VB

Modi@8: బలమైన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ.. మోదీని ఎదుర్కోవడంలో పనిచేయని కాంగ్రెస్ వ్యూహాలు..!

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రస్తుత భారత ప్రధాని, భాజపా నేత మోదీ మాత్రం అలాంటి పరిస్థితులకు భిన్నంగా ఉన్నారు. ప్రధానిగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ, 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు బలంగా కనిపిస్తున్నారు. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదు.

ఇంకా చదవండి ...
ఎనిమిదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల అభిప్రాయం సాధారణంగా మారే అవకాశం ఉంటుంది. 2012లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని(Congress Government) వరుస కుంభకోణాలు ఇరకాటంలో పెట్టినప్పుడు ఈ విషయం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు(Manmohan Singh) అర్థమైంది. అప్పటికి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(UPA)కు విజయాలు సుదూర జ్ఞాపకంగా అనిపించాయి. అయితే ప్రస్తుత భారత ప్రధాని, భాజపా నేత మోదీ(PM Modi) మాత్రం అలాంటి పరిస్థితులకు భిన్నంగా ఉన్నారు. ప్రధానిగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ, 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు బలంగా కనిపిస్తున్నారు. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్(Uttara Pradesh) , బీహార్(Bihar) వంటి కీలక రాష్ట్రాల్లోని ఎన్నికల విజయాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Narendra Modi@8: మోదీ హయాంలోనే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి.. 2014 ముందు ఇలా ఉండేది కాదన్న బీరేన్ సింగ్..


ద్రవ్యోల్బణం సమస్య, కోవిడ్ మహమ్మారి, చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మారుతున్న భౌగోళిక రాజకీయాలు వంటి సవాళ్ల ప్రభావం కూడా ప్రజల ఆలోచనలు, అభిప్రాయాల్లో కనిపిస్తోంది. ఇటువంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ దేశాల ముందు భారతదేశ శక్తిని చాటడానికి మోదీ వంటి బలమైన నాయకుడు కావాలని దేశ ప్రజలు నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీని అటువంటి నాయకత్వ స్థానంలో ఊహించుకోవడం సాధ్యమా అనే ప్రచారానికి భారతీయ జనతా పార్టీ తెరలేపింది.

కాంగ్రెస్‌కు కలలో కూడా సాధ్యం కాదు!
భాజపాను ఎదుర్కోవడం సాధ్యమని గాంధీ కుటుంబం సారథ్యంలోని కాంగ్రెస్‌ కలలో కూడా భావించడం లేదని భాజపా సీనియర్‌ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకురాలిగా సోనియా గాంధీ 2004లో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయిని, 2009లో ఎల్‌కె అద్వానీ ఆశయాన్ని ఓడించారు. అయితే భాజపా దిగ్గజాలను ఓడించగలిగిన కాంగ్రెస్‌ నాయకత్వం మోదీని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైంది.
జాతీయ స్థాయిలో వారసత్వ రాజకీయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, 2014 నుంచి దేశ రాజకీయాలు మారుతున్నాయని మోదీ నేతృత్వంలోని బీజేపీ నమ్ముతోంది.

జాతీయ వాదాన్ని ముందుకు తీసుకురావడం, కులాల ప్రాతిపదికన కాకుండా హిందుత్వ వాదంతో ఓట్లను అభ్యర్థించడం, పేద గ్రామీణ ఓటర్ల సంక్షేమానికి పథకాలను తీసుకురావడం వంటివి మోదీ గెలుపు సూత్రంగా మారాయి.
ప్రతిపక్షానికి బలమైన నాయకత్వం కరవైంది. వరుసగా ఎన్నికల్లో ఓటమిపాలవుతున్న కాంగ్రెస్‌కు బదులుగా అధికారాన్ని తీసుకోవాలనే అనేక ప్రాంతీయ నాయకుల ఆశయాల మధ్య పెద్ద ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాలు 2014 నుంచి విఫలమవుతున్నాయి. ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ ఉంటే.. అదే మోదీ విజయానికి ప్రధాన కారణమవుతుందని ప్రాంతీయ పార్టీల నేతలు భావిస్తున్నారు.

Narendra Modi@8: ఎన్డీఏ ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు.. మోదీ ప్రారంభించిన ఎనిమిది ముఖ్య పథకాలు ఇవే..


మోదీ ఎలా గెలుస్తారు?
నరేంద్ర మోదీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల విజయాలను పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. 2014లో పదేళ్ల యూపీఏ పాలన, అవినీతి కుంభకోణాలు, లోక్‌పాల్‌పై అన్నా ఉద్యమం, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, మోదీ జాతీయవాద వ్యక్తిత్వం, అధ్యక్ష ఎన్నికల తరహా ప్రచారం, జాతీయవాదం, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. హిందుత్వ వాదం, అభివృద్ధి వాగ్దానం మోదీకి మద్దతును పెంచాయి. ఈ కారణాలతో బీజేపీ 2014 ఎన్నికల్లో 282 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లలో 73 కైవసం చేసుకుంది.

2019లో అతిపెద్ద విజయం కూడా కారణాలు లేకుండా సాధ్యపడలేదు. ఐదు సంవత్సరాల అధికారంలో మోదీ కొత్త వర్గం ఓటర్లను సృష్టించారు . గ్రామీణ పేదలు లక్ష్యంగా పథకాలను తీసుకొచ్చారు. ప్రధానంగా గ్రామాల్లోని పేదలకు రాయితీలపై గ్యాస్ సిలిండర్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రయోజనాలు అందించారు. సున్నా బ్యాంకు ఖాతాలు, అందరికీ ఇల్లు వంటి పథకాలు కూడా తీసుకొచ్చారు. నిజానికి మోదీకి ప్రధాన మద్దతుదారులు మహిళలే. 2019లో కులం వంటి సంప్రదాయిక కారణాలు కాకుండా మోదీకి మద్దతుగా ఈ వర్గం పెరిగింది. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు, పుల్వామా దాడి తర్వాత ఫిబ్రవరి 2019లో పాకిస్థాన్‌ బాలాకోట్ దాడితో జాతీయవాద ఉత్సాహం గరిష్ట స్థాయికి చేరుకోవడం బీజేపీ విజయానికి సహాయపడింది. రాహుల్ గాంధీ రాఫెల్ “స్కామ్” ఆరోపణలు బీజేపీని ఇబ్బంది పెట్టలేకపోయాయి. గత ఎన్నికల కంటే బీజేపీ పెద్ద సంఖ్యలో 303 సీట్లతో గెలిచింది.

 మిక్స్‌డ్‌ త్రీ ఇయర్స్ ఆఫ్ మోదీ 2.0
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 సెక్షన్‌లను రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి పెద్ద నిర్ణయాలతో మోడీ రెండవ టర్మ్ ప్రారంభమైంది. రానున్న నెలల్లో జమ్మూ కాశ్మీర్‌లో శాంతియుత ఎన్నికలు నిర్వహించడం కేంద్రానికి పెద్ద సవాలు. సుప్రీంకోర్టు నుంచి వెలువడిన అయోధ్య తీర్పు మోదీ ప్రభుత్వానికి కలిసి వచ్చింది. ఇదే 2022లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి కారణమైంది.

అయినప్పటికీ వ్యవసాయాన్ని సంస్కరించడానికి మూడు సాగు చట్టాలను తీసుకురావడం, పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు చేయడం వంటివి భాజపాకు అనుకూలించలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో ప్రధానంగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఒక సంవత్సరం పాటు సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాటాలు చేశారు. షాహీన్ బాగ్ నిరసన ప్రపంచ దృష్టిని ఆకర్షించిన తర్వాత పార్లమెంటులో చట్టం చేసినప్పటికీ CAA ఇప్పటికీ అమలు చేయాల్సి ఉంది.

MonkeyPox : మహమ్మారిలా మంకీపాక్స్ -గాలి ద్వారా వ్యాప్తి? -క్వారంటైన్ విధిస్తూ బెల్జియం సంచలనం


మోదీ నేతృత్వంలోని భారతదేశం కోవిడ్ మహమ్మారిని విజయవంతం ఎదుర్కొంది. రెండు స్వదేశీ వ్యాక్సిన్‌లను ప్రపంచానికి అందించింది. వచ్చే నెల నాటికి దేశంలో మొత్తం వ్యాక్సినేషన్ మార్కు దాదాపు 200 కోట్లకు చేరుకొంటుంది. ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసిలో జ్ఞాన్‌వాపి వంటి న్యాయపోరాటాలలో హిందూత్వ స్వరం 2024కి ముందు మోదీ రాజకీయ అవకాశాలను బలపరుస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలకు ప్రముఖ దేశాల నుంచి అధికారిక దౌత్యపరమైన స్పందన లేకపోవడంతో మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఇప్పుడు బలమైన దేశంగా ఉందని తెలుస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: Bjp, Narendra modi, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు