PM Modi: ప్రధాని మోదీకి 70 శాతం రేటింగ్.. 13 మంది ప్రపంచనేతల కంటే ఎక్కువ

నరేంద్ర మోదీ (File image)

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేటింగ్ కొంత తగ్గిన మాట వాస్తవమే. కానీ... ప్రపంచ దేశాల అధినేతలతో పోల్చితే... బాగానే ఉంది. దీనిపై లోతైన విశ్లేషణ చూద్దాం.

  • Share this:
    PM Narendra Modi: ది మార్నింగ్ కన్సల్ట్ జరిపిన సర్వే ప్రకారం... ప్రపంచంలోని 13 మంది దిగ్గజ నేతల కంటే ఎక్కువ రేటింగ్‌ తెచ్చుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానిగా ఆయన్ను ఇప్పటికీ 70 శాతం (approval rating) మంది ఆమోదిస్తున్నారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయ్ లోపెజ్ ఒబ్రాడోర్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ, జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (joe biden) కంటే... ప్రధాని నరేంద్ర మోదీ రేటింగే ఎక్కువగా ఉంది. ఈ లిస్టులో ఇంకా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా పీఎం ట్రడ్యు, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తదితరులు ఉన్నారు.

    ఒక రకంగా చెప్పాలంటే... ప్రధానమంత్రిగా మోదీ రేటింగ్ కాస్త పెరిగింది. ఇది జూన్‌లో 66 శాతమే ఉండేది. ఇప్పుడు 70 శాతానికి చేరుకోవడం విశేషం.

    ప్రపంచ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ రేటింగ్ ఎలా ఉందో చూద్దాం.

    నరేంద్ర మోదీ (భారత ప్రధానమంత్రి): 70%

    లోపెజ్ ఒబ్రాడోర్ (మెక్సికో అధ్యక్షుడు): 64%

    మారియో డ్రాగ్నీ (ఇటలీ ప్రధాని): 63%

    ఏంజెలా మెర్కెల్ (జర్మనీ ఛాన్స్‌లర్): 52%

    జో బిడెన్ (అమెరికా అధ్యక్షుడు): 48%

    స్కాట్ మారిసన్ (ఆస్ట్రేలియా ప్రధాని) : 48%

    జస్టిన్ ట్రుడ్యూ (కెనడా ప్రధాని): 45%

    బోరిస్ జాన్సన్ (బ్రిటన్ ప్రధాని): 41%

    జైర్ బోల్సోనారో (బ్రెజిల్ అధ్యక్షుడు): 39%

    మూన్ జే-ఇన్ (దక్షిణ కొరియా అధ్యక్షుడు): 38%

    పెడ్రో షాంచెజ్ (స్పెయిన్ ప్రధాని): 35%

    ఇమాన్యూయల్ మాక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు): 34%

    యొషిహిదే సుగా (జపాన్ ప్రధాని): 25%

    తగ్గిన వ్యతిరేకత: చెప్పాలంటే ప్రధానిగా నరేంద్రమోదీ రేటింగ్ 25 శాతం దాకా తగ్గింది. ఎందుకంటే... 2020 మేలో ఆయన రేటింగ్ 84 శాతం దాకా ఉండేది. కరోనా సమయంలోనే ఆయన రేటింగ్ అత్యధికంగా ఉంది. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) గ్రాఫ్ ప్రకారం... మేలో మోదీపై వ్యతిరేకత బాగా పెరిగింది. ఆ సమయంలో ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దాన్ని కేంద్రం సరిగా ఎదుర్కోలేదన్న విమర్శలు వచ్చాయి.

    ఇది కూడా చదవండి: Earth: భూమిపై రాబోతున్న మహా ఖండం.. సైంటిస్టుల అంచనా

    ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వచ్చేలా ఉన్నా... మోదీ తన రేటింగ్ పెంచుకోగలిగారు. ఆయన్ని ప్రధానిగా వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య మేలో కంటే ఇప్పుడు తగ్గినట్లైంది. మార్నింగ్ కన్సల్ట్ ప్రతి దేశంలో 7 రోజుల సగటును లెక్కలోకి తీసుకొని రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఎర్రర్ మార్జిన్ +/- 1-3% ఉంటుంది. ఇండియాలో 2,126 మంది పెద్దవాళ్లను శాంపిల్‌గా ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసి ఈ డేటా రూపొందించింది.

    మొత్తానికి ఈ సర్వే బీజీపే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే బీజేపీలో 70 ఏళ్లు దాటిన వాళ్లు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే సంప్రదాయం ఉంది. మోదీకి ప్రస్తుతం 70 ఏళ్లు.
    Published by:Krishna Kumar N
    First published: