#HappyBdayPMModi: ప్రధాని మోదీ పుట్టిన రోజున 1.25 కేజీల స్వర్ణ కిరీటం సమర్పించిన అభిమాని...

ప్రధాని మోదీ రెండోసారి విజయవంతంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అర్వింద్ ఆయన జన్మదినం పురస్కరించుకొని ఆలయంలోని భగవంతుడికి కిరీటం సమర్పించారు.

Krishna Adithya | news18-telugu
Updated: September 17, 2019, 5:29 PM IST
#HappyBdayPMModi: ప్రధాని మోదీ పుట్టిన రోజున 1.25 కేజీల స్వర్ణ కిరీటం సమర్పించిన అభిమాని...
బంగారు కిరీటం సమర్పించిన మోదీ అభిమాని అర్వింద్ సింగ్
  • Share this:
ప్రధాని నరేంద్రమోదీ 69వ జన్మదినం పురస్కరించుకొని వారణాసి ప్రాంతానికి చెందిన ఓ అభిమాని సంకట్ మోచన్ ఆలయంలో సుమారు 1.25కేజీల బంగారు కిరీటాన్ని సమర్పించారు. వివరాల్లోకి వెళితే బీజేపీ కార్యకర్త అయిన అర్వింద్ సింగ్ ప్రధానిగా నరేంద్రమోదీ రెండో పర్యాయం గెలిస్తే, బంగారు కిరిటాన్ని సంకట్ మోచన్ హనుమాన్ కు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. అయితే ప్రధాని మోదీ రెండోసారి విజయవంతంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అర్వింద్ ఆయన జన్మదినం పురస్కరించుకొని ఆలయంలోని భగవంతుడికి కిరీటం సమర్పించారు. తాను సమర్పించిన కిరీటం తరహాలోనే భారత్ సైతం మోదీ హయాంలో వెలిగిపోతుందని అర్వింద్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే ప్రధాని మోదీ తన పుట్టిన రోజుని పురస్కరించుకొని స్వరాష్ట్రమైన గుజరాత్ లో పర్యటిస్తున్నారు. మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సేవా సప్తాహ్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: September 17, 2019, 5:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading