హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pm Modi: డిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించిన ప్రధాని మోడీ..ఇది న్యూ ఇండియా అంటూ కీలక వ్యాఖ్యలు

Pm Modi: డిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించిన ప్రధాని మోడీ..ఇది న్యూ ఇండియా అంటూ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గుజరాత్ లో (Gujarat) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గాంధీనగర్ (Gandhinagar) లో డిఫెన్స్ ఎక్స్ పో 2022ను ప్రధాని మోడీ (Narendra Modi) ప్రారంభించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మాట్లాడుతూ..ఈ డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Gujarat

భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గుజరాత్ లో (Gujarat) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గాంధీనగర్ (Gandhinagar) లో డిఫెన్స్ ఎక్స్ పో 2022ను ప్రధాని మోడీ (Narendra Modi) ప్రారంభించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మాట్లాడుతూ..ఈ డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక. భారతదేశ (India) రక్షణ ఉత్పత్తి సామర్ధ్యాలను ప్రదర్శించడం దీని యొక్క లక్ష్యం. ఈ ఎక్స్ పోలో కేవలం భారతదేశానికి చెందిన కంపెనీలు మాత్రమే పాల్గొంటాయని మోడీ తెలిపారు.

ఈ ఎక్స్ పోలో భారత్ యొక్క కొత్త చిత్రం కనిపించిందని అన్నారు.  అమృత్ కల్ లో మేము తీసుకున్న నిర్ణయానికి న్యూ ఇండియా గొప్ప చిత్రాన్ని గీస్తుందని ప్రధాని మోడీ (Narendra Modi) అన్నారు. ఇందులో దేశాభివృద్ధి, రాష్ట్రాల భాగస్వామ్యం, యువత కలలు కూడా ఉన్నాయి. డిఫెన్స్ ఎక్స్పోతో మొట్టమొదటిసారి భారత నేలలో ప్రజల చెమటతో తయారైన అనేక ఉత్పత్తులు మన దేశ కంపెనీలు, మన శాస్త్రవేత్తలు, మన యువత శక్తి, సర్ధార్ పటేల్ గడ్డ నుంచి ఈరోజు మన సత్తా ప్రపంచానికి చాటుతున్నాం అన్నారు. ఇక్కడ తొలిసారిగా 450కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ (Narendra Modi) పేర్కొన్నారు.

Gujarat | At the inauguration ceremony of the #DefExpo22 at Gandhinagar, PM Narendra Modi lays the foundation stone of 52 Wing Air Force Station Deesa. pic.twitter.com/3tozXKkt5i

— ANI (@ANI) October 19, 2022

నేడు ప్రపంచీకరణ యుగంలో మర్చంట్ నేవీ పాత్ర విస్తరించింది. అంతర్జాతీయ భద్రత నుండి ప్రపంచ వాణిజ్యం వరకు సముద్ర భద్రత ప్రపంచ ప్రాధాన్యతగా ఉద్భవించిందని అన్నారు. భారత్ పై ప్రపంచ దేశాల అంచనాలు పెరిగాయని, వాటిని భారత్ నెరవేర్చుకోవాల్సి ఉందన్నారు. ఈ డిఫెన్స్ ఎక్స్ పో కూడా భారతదేశం పట్ల నమ్మకానికి చిహ్నం. ప్రభుత్వంలోకి వచ్చాక కార్యాచరణ స్థావరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నామని ఈరోజు నిరీక్షణ నెలవేరుతుందని అన్నారు.

ఈ ప్రాంతం ఇప్పుడు దేశ భద్రతకు సమర్ధవంతమైన కేంద్రంగా మారుతుంది. అంతరిక్షంలో భవిష్యత్ అవకాశాలను పరిశీలిస్తే భారతదేశం సన్నద్ధతను మరింత పెంచుకోవాలి. మన రక్షణ దళాలు కొత్త ఆవిష్కరణ పరిష్కారాలు కనుగొనాల్సిన ఉంది. భారతదేశం యొక్క శక్తి పరిమితం కాకూడదు. అలాగే భారతదేశ ప్రజలకు మాత్రమే పరిమితం కాకూదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

First published:

Tags: Gujarat, India, Pm modi

ఉత్తమ కథలు