PRIME MINISTER MODI INAUGURATES PRIME MINISTERS MUSEUM AND PURCHASE FIRST TICKET DETAILS HERE GH VB
PM Modi: ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ.. మొదటి టికెట్ కొనుగోలు..
కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
భారత మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. యువతకు ఆదర్శంగా నిలిచేలా, గత ప్రధానులకు సంబంధించిన విశేషాలను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.
భారత మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం(Museum) ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ(Pradhan Mantri Sangrahalaya)’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) గురువారం ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. యువతకు ఆదర్శంగా నిలిచేలా, గత ప్రధానులకు సంబంధించిన విశేషాలను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. దీన్ని ప్రారంభించిన సందర్భంగా మోదీ ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ మొదటి టిక్కెట్‌ను(First Ticket) కొనుగోలు చేశారు. ఈ మ్యూజియం గత ప్రధానమంత్రుల కథలను, వివిధ సవాళ్లను ఎదుర్కొంటూ వారు దేశాన్ని నడిపించిన విధానాన్ని చెబుతుందని అధికారులు చెబుతున్నారు. స్వాతంత్య్రం తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రధానులకు సంబంధించిన విశేషాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. భారతదేశ చరిత్రను(Indian History) చాటి చెప్పేలా ఈ మ్యూజియానికి రూపకల్పన చేశారు. ప్రధాన మంత్రులందరి సహకారాన్ని పార్టీలకతీతంగా గుర్తించడమే ఈ మ్యూజియం లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.
‘14 మంది భారత మాజీ ప్రధానుల గురించి అవగాహన కల్పించడానికి ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశాం. ఇది వారి భావజాలం లేదా పదవీకాలంతో సంబంధం లేకుండా ప్రధానమంత్రులందరి సహకారాన్ని గుర్తిస్తుంది’ అని అధికారులు తెలిపారు. మ్యూజియంలో దేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ జీవితం, ఆయన దేశానికి చేసిన సేవలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఆయనకు లభించిన అనేక బహుమతులను మొదటిసారిగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
రైజింగ్ ఇండియా నినాదంతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. వేర్వేరు నాయకుల చేతుల్లో కొత్త రూపు సంతరించుకున్న భారత దేశానికి ప్రధానులు చేసిన సేవలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ భవనం లోగో దేశం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా "చక్రం" పట్టుకున్న భారతదేశ ప్రజల చేతులను సూచిస్తుంది. ప్రధానమంత్రి సంగ్రహాలయ మ్యూజియంలో సమాచారాన్ని సులభంగా, ఆసక్తికరంగా అందించే ప్రయత్నాలు చేశారు. ఇందుకు హోలోగ్రామ్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మల్టీ-టచ్, మల్టీ-మీడియా, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు, కంప్యూటరైజ్డ్ కైనటిక్ శిల్పాలు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లు, ఇంటరాక్టివ్ స్క్రీన్లు, ఎక్స్‌పీరియన్షియల్ ఇన్‌స్టాలేషన్స్ ఉపయోగిస్తున్నారు.
Delhi: PM Modi buys the first ticket at 'Pradhanmantri Sangrahalaya'- a museum dedicated to country's Prime Ministers since Independence pic.twitter.com/Qu0rUofSMu
భారత పౌరులకు ప్రధానమంత్రి సంగ్రహాలయ ప్రవేశానికి ఆన్లైన్ టిక్కెట్ ధర రూ.100 కాగా, ఆఫ్‌లైన్ టికెట్ ధర రూ.110. విదేశీయులకు టిక్కెట్ ధరను రూ.750గా నిర్దేశించారు. 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్లలో టిక్కెట్లను కొనుగోలు చేస్తే 50% డిస్కౌంట్ వర్తిస్తుంది. కాలేజ్, స్కూల్ స్టూడెంట్స్.. వారి విద్యాసంస్థలు చేసిన బుకింగ్స్‌పై 25% డిస్కౌంట్ పొందవచ్చు. ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’కు సమీప మెట్రో స్టేషన్ లోక్ కళ్యాణ్ మార్గ్.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.