హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: పార్లమెంట్ లో ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం..ప్రజలే నా రక్షణ కవచం అంటూ..

PM Modi: పార్లమెంట్ లో ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం..ప్రజలే నా రక్షణ కవచం అంటూ..

ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ

ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ

దేశం కోసం కాదు..ఈడీ కోసం ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయని పార్లమెంట్ లో ప్రధాని మోదీ (Pm Narendra Modi)అన్నారు. కోట్లాది ప్రజల విశ్వాసం తన రక్షణ కవచం అని, తాను 25 కోట్ల కుటుంబాలలో సభ్యుడినని తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశం కోసం కాదు..ఈడీ కోసం ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయని పార్లమెంట్ లో ప్రధాని మోదీ (Pm Narendra Modi)అన్నారు. కోట్లాది ప్రజల విశ్వాసం తన రక్షణ కవచం అని, తాను 25 కోట్ల కుటుంబాలలో సభ్యుడినని తెలిపారు. అణగారిన పేదలు, మధ్యతరగతి వారి సంక్షేమం కోసం పని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. విపత్కర సమయాల్లో మోదీ (Narendra Modi) తమకు సహాయం చేశారని ప్రజలకు తెలుసు..విపక్షాల ఆరోపణలు, దూషణలతో అది విచ్ఛిన్నం కాదని..ఆ ఆరోపణలను ప్రజలు ఎలా అంగీకరిస్తారని ప్రధాని మోదీ (Pm Narendra Modi) ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

PM Modi: సంకల్ప్ నుంచి సిద్ధి వరకు రాష్ట్రపతి ప్రసంగం ఓ బ్లూప్రింట్.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ

కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్..

పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ (Pm Narendra Modi) కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో దేశంలో అవినీతి రాజ్యమేలిందని తీవ్ర విమర్శలు చేశారు. వారి పాలనలో ప్రతి అవకాశాన్ని కూడా సంక్షోభంగా మార్చడమే యూపీఏ ట్రేడ్ మార్క్ అని ప్రధాని (Pm Narendra Modi) విమర్శించారు. 2G స్కామ్, బొగ్గు, కామన్వెల్త్ గేమ్స్ లో కూడా స్కామ్ జరిగిందని మోదీ ఆరోపించారు. ఈడీ మాత్రమే ప్రతిపక్షాలన్నింటిని కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చిందని..ఓటర్లు చేయలేనిది చేసిందని ప్రధాని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న 2004-2014 కాలాన్ని కోల్పోయిన దశాబ్ది అని ప్రధాని  (Pm Narendra Modi) అన్నారు.

మోదీని ఇండియా నమ్ముతుంది..అదానీకి ఎందుకిచ్చారని మీ బావని అడుగు..రాహుల్ కిబీజేపీ కౌంటర్

మన దేశంలోనే డేటా ఛార్జీలు తక్కువ..

ఇక మన దేశంలోనే మొబైల్ డేటా ఛార్జీలు తక్కువగా వున్నాయని ప్రధాని అన్నారు. మా హయాంలో ఏకంగా 70 ఎయిర్ పోర్టులు కట్టినట్లు మోదీ గుర్తు చేశారు. 2020 నుంచి 2030 వరకు 'ఇండియా డికేడ్' గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని స్పష్టం చేశారు. నాలుగు వరసల రోడ్లను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాం. మౌళిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలు నెగెటివిటీని నమ్మడం లేదని, ప్రతిపక్షాలు పునరాలోచించుకోవాలని తెలిపారు.

నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశానని ప్రధాని మోదీ అన్నారు. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేస్తారని, కానీ 25 వేల కోట్ల కుటుంబాలలో తాను ఓ సభ్యుడినని ఎమోషనల్ గా మాట్లాడారు. 140 కోట్ల మంది ప్రజలే తనకు రక్షణ కవచమని, దాన్ని మీరు చేధించలేరని ప్రతిపక్షాలను మోదీ ఏకిపారేశారు.

First published:

Tags: India, Narendra modi, Parliament, Pm modi, PM Narendra Modi

ఉత్తమ కథలు