గుజరాత్ మోర్బీలో అత్యంత పురాతన కేబుల్ బ్రిడ్జి (Cable bridge)కుప్పకూలింది. ఈదుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై సుమారు 500మంది వరకు సందర్శకులు, స్థానికులు ఉన్నారు. వంతెన కూలిపోవడంతో వందలాది మంది కింద ఉన్న మచ్చు నదిలో పడిపోయారు. నదిలో పడిపోయిన వాళ్లలో ఇప్పటి వరకు 60మందికిపైగా చనిపోయారని గుజరాత్(Gujarat)పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బ్రిజేష్ మీర్జా(Brijesh Mirza)తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఘటన స్తలానికి చేరుకున్న మంత్రి పోలీసులు(Police), సహాయక బృందాలతో రక్షణ చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు.
అరవై మంది మృతి..
మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే గుజరాత్ సీఎం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు మోదీ. ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది.
కుప్పకూలిన వంతెన..
నదిలో కుప్పకూలిన వంతెన సుమారు 140సంవత్సరాల క్రితం బ్రిటీష్ కాలంలో నిర్మించినదిగా తెలుస్తోంది. ఈ కేబుల్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు ఇటీవలే పూర్తి చేశారు. ఐదు రోజుల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. సందర్శకుల్ని అనుమతిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రమాదం జరగినట్లుగా గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. నదిలో పడిపోయిన వాళ్లలో 70 మందిని కాపాడామని వెల్లడించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వంతెన కూలిపోయిన వెంటనే చాలామంది నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each of those who lost their lives in the mishap in Morbi. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) October 30, 2022
మృతుల కుటుంబాలకు పరిహారం..
నదిలో పడిన వాళ్లను సురక్షితంగా బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నదిలో పడిన వాళ్లలో చాలా మంది కేబుల్ వంతెన తెరను పట్టుకొని నిదానంగా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. నది దగ్గర సహాయకచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujrath news, National News