Priest Convert To Islam : కర్ణాటక(Karnataka)లో ఓ పూజారి(Priest) వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిందూ మతం వదిలి ఇస్లాం(Islam) మతం స్వీకరించిన కొన్ని గంటల్లోనే తిరిగి హిందూ మతంలోకి పూజారి వచ్చిన అంశం ఇప్పుడు చర్చనీయాంశలోమైంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని హిరేహళ్లి ఓంకారేశ్వర ఆలయంలో చంద్రశేఖరయ్య అనే 61 ఏళ్ల వ్యక్తి పూజారిగా ఉన్నాడు. అయితే గతవారం చంద్రశేఖరయ్య తాను ఇస్లాం మతంలోకి మారాలి అని నిర్ణయించుకున్నట్లు ఓ ప్రకటన జారీ చేశారు. వ్యక్తిగత కారణాలతో గురువారం తాను ఇస్లాం మతం స్వీకరించినట్లు,తన పేరు ముబారక్ పాషాగా మార్చుకున్నట్లు స్థానిక వార్తాపత్రికలో చంద్రశేఖరయ్య ఓ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వా త కొన్ని గంటలకే ముస్లిం వేషధారణలో మసీదులో కోరగెరె తాలూకాలోని తోవినకెరె గ్రామంలోని మసీదులో చంద్రశేఖరయ్య ప్రార్థన చేస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెలిపారు.
అయితే అసలు చంద్రశేఖరయ్య మతం మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆరా తీయగా..అతనికి సోదరులతొ ఆస్తి తగాదాలతో పాటు ఆలయ అర్చకత్వం విషయంలో విభేధాలు ఉన్నట్ల తెలిసింది. ఈ నేపథ్యంలోనే తనకు ఎవరూ సాయం చేయరని భావించి ఆయన ఇస్లాంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే మతమార్పిడి వార్త తెలియగానే చంద్రశేఖరయ్య నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి సొగడు శివన్న ఆయనను ఒప్పించడంలో సఫలమయ్యారు. తనకు మధుమేహం ఉన్నందున ఇస్లాం మతంలోక మారితే సున్నతి చేయించుకోవాలని,తనకు డయాబెటిస్ ఉన్నందున అది తనకు లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందేమోనని భయపడిని చంద్రశేఖరయ్య తిరిగి హిందూమతంలోకి వచ్చాడు,
ఇదేందయ్యా ఘోరం : రూ.37 లక్షల ఆదాయపు పన్ను కట్టాలని రోజువారీ కూలీకి నోటీసులు
"అన్నయ్య గొడవతో విసిగిపోయాను. నేను చనిపోతే నా శవాన్ని పాతిపెడతారు అని నిర్ణయించుకుని మతం మారాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. మతమార్పిడి జరగాలంటే సున్నతి అయి ఉండాలి. నాకు డయాబెటిస్ ఉన్నందున నేను చేయలేను. మాజీ మంత్రి సోగడు శివన్న నాతో మాట్లాడి, నన్ను ప్రక్షాళన చేయడానికి నన్ను ఒక జ్ఞాని వద్దకు తీసుకెళ్లారు. నేను మరోసారి లింగాయత్ దీక్ష తీసుకుంటాను. నేను హిందువుని, హిందువుగానే ఉంటాను"అని చంద్రశేఖరయ్య చెప్పారు. ఇక తాను ముస్లింలు ధరించే శాలువా మరియు టోపీ ధరించినట్లు వైరల్ అవుతున్న ఫొటోపై చంద్రశేఖరయ్య క్లారిటీ ఇచ్చారు. తోవినకెరెలో కొత్త మసీదు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్ళానని చెప్పారు. అది మతమార్పిడి కాదని అన్నారు. తాను అన్ని మతాల వారితో అనుబంధం కలిగి ఉన్నానని.. ముస్లింలు ధరించే తలపాగాను తాను ఇంతకు ముందు చాలాసార్లు ధరించానంటూ వైరల్ అవుతున్న ఫోటోపై క్లారిటీ ఇచ్చాడు.
మీడియాతో మాట్లాడిన చంద్రశేఖరయ్య భార్య.. రెండు నెలలకోసారి మతం మారతానని చెప్తారు. ఇది జోక్ అని నాకు మొదట్లో తెలుసు. పండుగ పూట టోపీలు పెట్టుకునేవారు. ముస్లింలతో మేం బాగానే ఉన్నాం. పండుగల సమయంలో భోజనానికి పిలుస్తాం. తమ పండుగ అయితే మాకు రేషన్ ఇస్తారని చెప్పారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడంతో భర్త మూడ్ మారిపోయింది. ఈ కారణాల వల్ల అతను మతం మారడానికి సిద్ధంగా ఉన్నాడు. తన సొంత నిర్ణయంతో మతం మారాలని నిర్ణయించుకున్నారే తప్ప ఎవరూ ఆహ్వానించలేదు. తన భర్తను ఎవరూ బలవంతం చేయలేదని చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hindu Temples, Karnataka