Presidential Elections 2022: యశ్వంత్ సిన్హా నామినేషన్.. వెంట రాహుల్, కేటీఆర్ ఇంకా..
యశ్వంత్ సిన్హా నామినేషన్
రాష్ట్రపతి ఎన్నికల్లో (presidential elections 2022) కీలక ఘట్టం చోటుచేసుకుంది. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఎంచుకోగా, ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో (presidential elections 2022) కీలక ఘట్టం చోటుచేసుకుంది. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా (Yashwant Sinha)ను ఎంచుకోగా, ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవడం తెలిసిందే. బలాబలాల దృష్ట్యా ముర్ము గెలుపు లాంఛనమే అయినప్పటికీ, మోదీ తీరుపై విధానపరమైన వ్యతిరేకతలో భాగంగానే విపక్షాలు అభ్యర్థిని నిలిపాయి.
యశ్వంత్ సిన్హా నామినేషన్ సందర్భంగా పార్లమెంట్ భవనంలోని రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అరుదైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల నేతలు ఒక్కతాటిపైకొచ్చి, పక్కపక్కనే నిలబడి సిన్హాకు మద్దతు పలకారు.
యశ్వంత్ సిన్హా నామినేషన్ పర్వంలో రాహుల్ గాంధీ, కేటీఆర్ తదితర నేతలు
యశ్వంత్ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత ఏ.రాజా ముందు వరుసలో కూర్చొని యశ్వంత్ చేత నామినేషన్ వేయించారు.
అలాగే నేషనల్ కాన్పరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, సీపీఐ నేత డి.రాజా, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ తదితరులు సిన్హా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉన్నా అనుకోని ఆమె బదులు పార్టీ సీనియర్లు హాజరయ్యారు.
తెలంగాణలో ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ అగ్రనేతలు ఒకేచోట చేరడం, ఉమ్మడి అభ్యర్థికి మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్కువ గ్యాప్ లోనే కూర్చొని కనిపించారు. కేటీఆర్ వెంట టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సైతం ఉన్నారు.
రాష్టపతి ఎన్నికల్లో ఎన్టీఏకు మెజార్టీ లేనప్పటికీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ, ఒడిశా అధికార పార్టీ బీజేడీలు మద్దతు తెలపడంతో ద్రౌపది ముర్ము గెలుపు దాదాపు ఖరారైంది. ఒడిశా బిడ్డగా ముర్ముకే మద్దతు తెలుపుతామని బీజేపీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటిండం, ఆదివాసి, అందునా మహిళ అయిందున తాము కూడా ముర్మునే సమర్థిస్తామని వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ చెప్పడంతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు నల్లేరుమీద నడకే అయింది. బీజేపీతో సైద్ధాంతిక విరోధమున్న పార్టీలు మాత్రం యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా నిలబెట్టాయి. జులై 10న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.