హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

President Election 2022: 5PM వరకు పోలింగ్.. క్రాస్ ఓటింగ్‌కు బీజేపీ యత్నం..

President Election 2022: 5PM వరకు పోలింగ్.. క్రాస్ ఓటింగ్‌కు బీజేపీ యత్నం..

రాష్ట్రపతి అభ్యర్థులు ముర్ము, సిన్హా

రాష్ట్రపతి అభ్యర్థులు ముర్ము, సిన్హా

రాష్ట్రపతి ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఇవాళ పోలింగ్ జరుగనుంది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే అయినా, క్రాస్ ఓటింగ్ కోసం బీజేపీ యత్నిస్తోంది..

ఇంకా చదవండి ...

భారతదేశ ప్రథమ పౌరుడు/పౌరురాలిని ఎన్నుకునే కీలక ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి ఎన్నికలకు (Presidential Election 2022) భారత ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఇవాళ పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ (Presidential Election 2022 polling) మొదలవుతుంది. తొలుత మాక్ పోలింగ్ చేపడతారు. ఉదయం 10 గంటల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల్లో మొత్తం 776 మంది ఎంపీలు, 28 రాష్ట్రాలు, శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఎక్కడికక్కడే గురువారం (జులై 21న) కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తారు.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈనెల 24న ము గియనున్న నేపథ్యంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి నేడు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా తలపడుతున్నారు. ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం నిర్వహించిన నేపథ్యంలో 100 శాతం పోలింగ్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రధాని మోదీ సహా ఎంపీలంతా ఢిల్లీలోనే ఓటేయనున్నారు.

సర్కారువారి సీక్రెట్స్ లీక్.. కేంద్రంపై CM KCR సంచలన ఆరోపణ.. PM Modi ఏడుపంటూ..


తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్రపతి ఎన్నికల్లో కనీసం పది ఓట్లు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ జరిగేలా ప్రయత్నించాలని బీజేపీ శాసనసభా పక్షం భావిస్తోంది. అందుకోసం పోలింగ్ కేంద్రమైన అసెంబ్లీకి 15 నిమిషాలు ముందుగానే వెళ్లి.. ఆత్మప్రబోధానుసారం ఓటువేయాలని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోరాలని బీజేఎల్పీ నిర్ణయించింది. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు కలిసి ఆదివారం సమావేశమై రాష్ట్రపతి ఎన్నికపై జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశానికి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందని, అందరూ ముర్ముకే ఓటేయాలని వారు కోరారు.

Monsoon session: 18 నుంచి ఢిల్లీలో దబిడి దిబిడే -బీజేపీకి చుక్కలు చూపించేలా KCR ప్లాన్


అయితే, తెలంగాణలో అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే మద్దతు పలకడం తెలిసిందే. సోమవారం ఉదయం వరంగల్ నుంచి హైదరాబాద్ రానున్న సీఎం కేసీఆర్ నేరుగా అసెంబ్లీకి వెళ్లి ఓటేస్తారు. ఆ సమయానికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం కానున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిన్హాకు ఓటు వేస్తారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు సైతం ముర్ముకు వ్యతిరేకంగానే ఓటేసే అవకాశముంది. ఇక..

TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!


ఇక ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి పోలయ్యే అన్ని ఓట్లూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు లభించనున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఇప్పటికే ముర్ముకు మద్దతివ్వడం తెలిసిందే. జగన్ అరాచకాలపై పోరులో భాగంగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నానని, తిరిగి సీఎంగానే వస్తానని గతంలో శపథం చేసిన టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎనిమిది నెలల తర్వాత అసెంబ్లీకి రానున్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Draupadi Murmu, Monsoon session Parliament, Parliament, President Elections 2022, Yashwant Sinha

ఉత్తమ కథలు