Home /News /national /

PRESIDENTIAL ELECTION 2022 PARLIAMENT MONSOON SESSION LIVE UPDATES PM MODI OTHER CAST VOTE IN DROUPADI MURMU VS YASHWANT SINHA BATTLE MKS

PM Modi Video : రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన మోదీ.. ఈ పార్లమెంట్‌ సెషన్ చాలా కీలకమన్న ప్రధాని

పార్లమెంటులో ఓటేస్తున్న ప్రధాని మోదీ

పార్లమెంటులో ఓటేస్తున్న ప్రధాని మోదీ

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలో ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు. వర్షాకాల భేటీపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు..

రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential election 2022) అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ సోమవారం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) కూడా ఇవాళే ప్రారంభం కావడంతో ఎంపీలందరూ ఢిల్లీలో, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు అసెంబ్లీల్లో ఓట్లు వేస్తున్నారు. పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు.

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం.. పార్లమెంట్‌ భవనంలోని రూమ్ 63లో మొత్తం ఆరు బూత్ ను ఏర్పాటు చేసింది. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువ ఉంటుంది కాబట్టి, ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను కేటాయించారు. మొత్తం 4809 మంది ఎలక్టరోరల్ కాలేజి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అందులో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మధ్య పోరు జరుగుతుండగా, ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించిన మద్దతులను బట్టి ముర్ము విజయం లాంఛనం కానుంది. ఇక,


President Election 2022: 5PM వరకు పోలింగ్.. క్రాస్ ఓటింగ్‌కు బీజేపీ యత్నం..


రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ముందు.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ద్వారా సందేశం ఇచ్చారు. కొత్త రాష్ట్రపతి, కొత్త ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభించే ఈ ప్రస్తుత సెషన్ ఎంతో కీలకమైందని, ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం కూడా అని ప్రధాని పేర్కొన్నారు.


Parliament Monsoon: వాడివేడిగా వర్షాకాల భేటీ -24 బిల్లులతో కేంద్రం.. అస్త్రాలతో విపక్షం.. నేటి నుంచే


పార్లమెంటులో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరగాలని, ఎంపీలందరూ లోతుగా ఆలోచించి చర్చించాలని కోరుతున్నానని, వర్షాకాల సమావేశాలు ఫలవంతం అవుతాయనే ఆశాభం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. 75వ స్వాతంత్ర్యదినోత్సవం నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం నడుస్తున్నదని, ఆగస్ట్ 15, ఇంకా రాబోయే 25 సంవత్సరాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే సమయంలో, మన ప్రయాణాన్ని, కొలవబోయే కొత్త ఎత్తులను నిర్ణయించడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఇదని ప్రధాని వ్యాఖ్యానించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Monsoon session Parliament, Parliament, Pm modi, President Elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు