హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Presidential Poll : నడవలేని స్థితిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇలా.. లోక్‌సభ‌ వాయిదా..

Presidential Poll : నడవలేని స్థితిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇలా.. లోక్‌సభ‌ వాయిదా..

వీల్ చౌర్ లో వచ్చి ఓటేసిన మన్మోహన్ సింగ్

వీల్ చౌర్ లో వచ్చి ఓటేసిన మన్మోహన్ సింగ్

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందడిగా సాగుతున్నది. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ఎంపీలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తున్నారు. నడవలేని స్థితిలోనూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి ఓటేశారు..

ఇంకా చదవండి ...

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential election 2022) అతి ముఖ్యమైన పోలింగ్ ప్రక్రియ సందడిగా సాగుతున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) కూడా ఇవాళే మొదలు కావడంతో ఎంపీలు ఢిల్లీలో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తున్నారు. ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. ఇప్పటి వరకు కనిపించిన జోరును బట్టి 100 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలు లేకపోలేవు. కాగా, ప్రధమ పౌరుడు/పౌరురాలి ఎన్నిక వేళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Former PM Manmohan Singh)ప్రజాస్వామిక స్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది..

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం.. పార్లమెంట్‌ భవనంలోని రూమ్ 63లో మొత్తం ఆరు బూత్ ను ఏర్పాటు చేసింది. అనారోగ్యంతో బాధపడుతోన్న మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి మరీ ఓటేశారు. వృద్ధాప్యం, కరోనా అనంతర సమస్యలతో బాధపడుతోన్న ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. ఎన్నికల సిబ్బంది సాయంతో మన్మోహన్ ఓటేశారు.

PM Modi Video : రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన మోదీ.. ఈ పార్లమెంట్‌ సెషన్ చాలా కీలకమన్న ప్రధాని


అంతకుముందు, ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ పద్దతిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువ ఉంటుంది కాబట్టి, ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను కేటాయించారు. మొత్తం 4809 మంది ఎలక్టరోరల్ కాలేజి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అందులో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మధ్య పోరు జరుగుతుండగా, ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించిన మద్దతులను బట్టి ముర్ము విజయం లాంఛనం కానుంది. ఇదిలా ఉంటే,

President Election 2022: 5PM వరకు పోలింగ్.. క్రాస్ ఓటింగ్‌కు బీజేపీ యత్నం..


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ, రాజ్యసభ కొలువుదీరాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన చివరి సెషన్ ను ప్రారంభించారు. అయితే విపక్షాల నినాదాలు, వాకౌట్లతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను మద్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దేశాన్ని నడిపించే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్నుకోవడం, 75వ స్వాతంత్ర్యదినోత్సవాలు జరుపుకోనుండటం తదితర కారణాలతో ఈ పార్లమెంట్ సెషన్ చాలా ముఖ్యమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Published by:Madhu Kota
First published:

Tags: Manmohan singh, Monsoon session Parliament, Parliament, President Elections 2022

ఉత్తమ కథలు