ఈనెల 21న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..శీతాకాల విడిది కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అధ్యక్షుడి రాష్ట్ర పర్యటనపై రాష్ట్రపతి భవన్‌ నుంచి సమాచారం అందుకున్న సిటీపోలీసులు.. పటిష్ట ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలూ అప్రమత్తమయ్యాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయన విడిది చేసే బొల్లారం రాష్ట్రపతినిలయాన్ని కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: December 15, 2019, 11:11 PM IST
ఈనెల 21న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..శీతాకాల విడిది కోసం ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
  • Share this:
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 21వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ రానున్నారు. అధ్యక్షుడి రాష్ట్ర పర్యటనపై రాష్ట్రపతి భవన్‌ నుంచి సమాచారం అందుకున్న సిటీపోలీసులు.. పటిష్ట ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలూ అప్రమత్తమయ్యాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయన విడిది చేసే బొల్లారం రాష్ట్రపతినిలయాన్ని కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ చుట్టుపక్కల ప్రజలెవరూ ప్రవేశించకుండా.. పోలీసులు నిషేధం విధించారు. శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి కోవింద్.. రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలపైనా, బందోబస్తు ఏర్పాట్లపైనా సీఎస్ ఆరా తీశారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఈనెల 28వ తేదీ వరకు ఆయన సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>