హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farm Laws Repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

Farm Laws Repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ఫైల్ ఫోటో)

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ఫైల్ ఫోటో)

Farm Laws: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లు గత సోమవారం శీతాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. చర్చ కోసం విపక్షాల డిమాండ్ల మధ్య వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు నాలుగు నిమిషాల్లోనే లోక్‌సభలో ఆమోదం పొందింది.

ఇంకా చదవండి ...

కేంద్రం ఇటీవల వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన బిల్లుపై సంతకం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లు గత సోమవారం శీతాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. చర్చ కోసం విపక్షాల డిమాండ్ల మధ్య వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు నాలుగు నిమిషాల్లోనే లోక్‌సభలో ఆమోదం పొందింది. ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా భారీ రైతు నిరసనలకు దిగొచ్చిన కేంద్రం.. ఏడాది క్రితం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెల 19న ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన ప్రకటనకు తగ్గట్టుగానే కేంద్రం.. త్వరితగతిన చట్టాలను ఉపసంహరించుకుంది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా రైతుల మరణాలకు సంబంధించిన రికార్డు లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం పార్లమెంటుకు తెలిపారు. సుమారు ఓ సంవత్సరం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని, వీరిలో కొందరు రైతులు మరణించారని, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే ఆలోచన ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించింది. దీనిపై నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వద్ద దీనికి సంబందించిన రికార్డు లేదని, అందువల్ల మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడమనే ప్రశ్న తలెత్తదని తెలిపారు.

ఇదిలావుండగా రైతు సంఘాలు చెప్తున్నదాని ప్రకారం, 2020 నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజీపూర్‌ వద్ద రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. తట్టుకోలేని వాతావరణం, అపరిశుభ్ర పరిసరాల వల్ల అనారోగ్యానికి గురికావడం, ఆత్మహత్యల వల్ల ఈ మరణాలు సంభవించాయి.

KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?

Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ రైతు సంఘాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, నిరసనల నేపథ్యంలో తమపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, నిరసనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలను కొనసాగిస్తామని చెప్తున్నాయి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Farm Laws, Ramnath kovind

ఉత్తమ కథలు