హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

President Ram Nath Kovind: వారందరికీ సెల్యూట్ చేద్దాం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి పిలుపు

President Ram Nath Kovind: వారందరికీ సెల్యూట్ చేద్దాం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి పిలుపు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (ఫైల్)

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (ఫైల్)

72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ తరం రాజ్యాంగ విలువలను కాపాడేందుకు చొరవ చూపాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ తరం రాజ్యాంగ విలువలను కాపాడేందుకు చొరవ చూపాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ను దేశం ధీటుగా ఎదుర్కొందని అన్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు మన శాస్త్రవేత్తలు అత్యంత తక్కువ సమయంలోనే టీకాను తయారు చేసి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి కొనియాడారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సేవలు మరువలేనవన్నారు. ప్రకృతి వైపరిత్యాలు, కరోనా భూతం సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వాటిని అధికమించి మనందరికీ సరిపడా ఆహార ధాన్యాలను అందిస్తున్న అన్నదాతలకు ప్రతీ పౌరుడు సెల్యూట్ చేస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. రైతుల సంక్షేమం కోసం దేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడమే లక్ష్యంగా ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని రాష్ట్రపతి అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ప్రజలకు రాష్ట్రపతి సూచించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ బీహార్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిందని రామ్ నాథ్ అభినందించారు.

గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా ప్రజలంతా సైనికులు, రైతులు, శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలపాలన్నారు. గతేడాది మన సరిహద్దులపై విస్తరణ కాంక్షతో జరిగిన ఘటనలను మన సైనికులు అధిగమించామని రాష్ట్రపతి అన్నారు. సరిహద్దులను కాపాడే క్రమంలో 20 మంది వీరజవాన్లు అమరులు అయ్యారన్నారు. వారి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదన్నారు.

First published:

Tags: Corona, Corona Vaccine, Farmers Protest, Ramnath kovind, Republic Day 2021

ఉత్తమ కథలు