Home /News /national /

PRESIDENT RAM NATH KOVIND WINTER VACATION IN HYDERABAD HAS CANCELLED PRESIDENT BHAVAN OFFICIALS DECLARED IT PRV

president winter stay in Hyderabad: రాష్ట్రపతి హైదరాబాద్​ శీతాకాల విడిది రద్దు.. ఒమిక్రాన్​ నేపథ్యంలో విడిదిపై పునరాలోచన?

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ఫైల్ ఫోటో)

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ఫైల్ ఫోటో)

షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3 వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావల్సి ఉంది.  అనివార్య కారణాల వల్ల రాష్ట్రపతి  శీతాకాల విడిది రద్దు అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.

ఇంకా చదవండి ...
    షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3 వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ramnath Kovind) శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావల్సి (president winter stay in Hyderabad) ఉంది.  అనివార్య కారణాల వల్ల రాష్ట్రపతి  శీతాకాల విడిది రద్దు అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వర్గాలు (Rashtrapati Bhavan, Delhi) వెల్లడించాయి. ప్రతి ఏడాది సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ramnath Kovind) శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఆయన డిసెంబర్ చివరి వారంలో రానున్నారని రాష్ట్రపతి భవన్ ఇటీవల తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడంతో తెలంగాణ అధికారులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై కంటోన్మెంట్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో మేడ్చల్‌ కలెక్టర్‌ హరీష్‌ సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

    ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో..

    రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది (president winter stay in Hyderabad) రద్దు అయ్యినట్లు తెలంగాణ ప్రభుత్వానికి (To the Government of Telangana) రాష్ట్రపతి భవన్‌ సమాచారం అందించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3 వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ramnath Kovind) హైదరాబాద్ రావల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసు పెరుగుతుండటం, కొత్తగా ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి రాక సందర్భంగా బొల్లారంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రోటోకాల్ విభాగం చేపట్టింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్‌ డ్రిల్ కూడా చేపట్టారు. ఇపుడు అకస్మాత్తుగా పర్యటన రద్దు అయింది.

    దేశవ్యాప్తంగానూ ఒమిక్రాన్ కేసులు (omicron cases) వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లకు కూడా కొత్త మహమ్మారి వ్యాపించింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ బాధిత రాష్ట్రాల సంఖ్య 19కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 459 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79 కేసులుండగా, 44 కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త ఏడాది వేడుకలను ప్రభుత్వం నిషేధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు పబ్లిక్ పేసుల్లో కార్యక్రమాల నిర్వహణను ప్రభుత్వం బ్యాన్ చేసింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతున్నది.

    తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44కి చేరింది. దీంతో తెలంగాణలో జనవరి 2 వరకు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే స్పష్టమైన కారణాలు చెప్పనప్పటికీ ఒమిక్రాన్​ తీవ్రత దృష్ట్యా రాష్ట్రపతి పర్యటన వాయిదా వేశారని తెలుస్తోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona, Hyderabad, Omicron, President of India, WINTER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు