పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Citizenship Amendment Act : రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో... పౌరసత్వ సవరణ బిల్లు ఇక చట్టంగా మారింది.

news18-telugu
Updated: December 13, 2019, 6:18 AM IST
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
రామ్ నాథ్ కోవింద్
  • Share this:
Citizenship Amendment Act : పౌరసత్వ (సవరణ) బిల్లు 2019ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఫలితంగా అది పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. అధికారిక గెజిట్ విడుదల చేయడంతో ఇది చట్టంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం... 2014 డిసెంబర్ 31కి ముందు... పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ నుంచీ భారత్‌లోకి వచ్చి నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు... భారత దేశ పౌరసత్వం పొందేందుకు అవకాశం లభించంది. ఐతే... ఆ వచ్చిన వారిలో... ఆయా దేశాల్లో మతపరమైన వేధింపుల్ని తట్టుకోలేక వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం లభించనుంది. పౌరసత్వ (సవరణ) బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించగా... బుధవారం రాజ్యసభ కూడా ఆమోదించింది. దాంతో రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. రాష్ట్రపతి కూడా ఆమోదించడంతో... చట్టంగా మారింది. ఐతే... ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... అసోంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. అసోం ప్రజల హక్కులకు ఎలాంటి భంగమూ కలగనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

 

Pics : ఐస్‌తో ఐస్ చేస్తున్న కేరళ బ్యూటీ ప్రియాంక
ఇవి కూడా చదవండి : 

అమ్మో కిలాడీ... డేటింగ్ పేరుతో రూ.73 లక్షలు దోపిడీగాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?

Health Tips : గుండె ఫిట్‌గా ఉండాలా... ఈ 5 చిట్కాలు పాటించండి

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : డయాబెటిస్ ఉంటే ఖర్జూరాలు తినవచ్చా?
First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు