జాతిపిత మహాత్మాగాంధీకి ప్రముఖుల ఘన నివాళి..

దేశ రాజధాని దిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విదేశాల్లోనూ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

news18-telugu
Updated: October 2, 2018, 1:01 PM IST
జాతిపిత మహాత్మాగాంధీకి ప్రముఖుల ఘన నివాళి..
గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ నివాళి
  • Share this:
జాతిపిత మహాత్మాగాంధీ 149వ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. యావత్ జాతి ఆయన సేవలను స్మరించుకుంటోంది. దేశ రాజధాని దిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విదేశాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన సేవలను స్మరించుకుంటున్నారు.

రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అలాగే అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, రాజ్యవర్థన్ రాథోడ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తదితరులు గాంధీకి నివాళులర్పించారు.


The noble thoughts of Mahatma Gandhi have given strength to millions across the world. He was a stalwart who lived for others and to make our world a better place. 

Performing Parikrama to the samadhi of Father of the Nation Mahatma Gandhi on his Birth Anniversary today at the Rajghat in Delhi. #MahathmaGandhi #GandhiJayanti pic.twitter.com/SHHXQaw1UNఅలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ తదితరులు ఉదయాన్నే రాజ్ ఘాట్‌ను సందర్శించారు.

అలాగే సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్న ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా జాతిపిత సమాధిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ గాంధీ 150వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు.లంగర్‌హౌస్‌ (హైదరాబాద్) లోని బాపూఘాట్‌లో తెలంగాణ కేసీఆర్ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయినీ నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
Published by: Janardhan V
First published: October 2, 2018, 12:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading