అక్టోబరు31 నుంచి యూటీలుగా జమ్మూకశ్మీర్, లద్దాఖ్..ఆ రోజునే ఎందుకంటే?

సర్దార్ వల్లభ భాయ్ పటేల్ 144వ జయంతి (అక్టోబరు 31 ) సందర్భంగా... రెండు కేంద్రపాలిత ప్రాతాల్లో ఉనికిలోని రానున్నాయి.

news18-telugu
Updated: August 13, 2019, 4:09 PM IST
అక్టోబరు31 నుంచి యూటీలుగా జమ్మూకశ్మీర్, లద్దాఖ్..ఆ రోజునే ఎందుకంటే?
జమ్మూకాశ్మీర్ మ్యాప్
  • Share this:
జమ్మూకశ్మీర్ విభజన బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్రవేశారు. ఈ  మేరకు రాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లు అక్టోబరు 31 నుంచి అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా కొనసాగుతాయి.  సర్దార్ వల్లభ భాయ్ పటేల్ 144వ జయంతి (అక్టోబరు 31 ) సందర్భంగా...  రెండు కేంద్రపాలిత ప్రాతాల్లో ఉనికిలోని రానున్నాయి. అప్పటి వరకు రెండు ప్రాంతాల్లో గవర్నర్ పరిపాలనే అమల్లో ఉంటుంది.

ఆగస్టు 5న రాజ్యసభలో జమ్ము కశ్మీర్‌ను  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్, లద్దాఖ్)గా విభజిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం అదే రోజుల రాజ్యసభలో బిల్లు పాసయింది.  ఆగస్టు 6న లోక్‌సభలో బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం జేకే విభజన బిల్లుకు లోక్‌సభ కూడా ఆమోద ముద్రవేసింది.  ఆ తర్వాత జమ్మూకశ్మీర్ విభజన బిల్లును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం కోసం పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి విభజన బిల్లును రాష్ట్రపతి ఆమోదించారు.

 

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>