కేరళలో పరిస్థితిపై రాష్ట్రపతి కోవింద్ ఆరా

వర్షాలు తెరపి ఇవ్వడంతో సహాయక చర్యలు జోరందుకోగా...కొందరు ఆకతాయిలు సాయం కోరుతూ హెల్ప్ లైన్స్‌కు ఉత్తుత్తి మెసేజ్‌లు పంపడం సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది.

news18-telugu
Updated: August 19, 2018, 4:37 PM IST
కేరళలో పరిస్థితిపై రాష్ట్రపతి కోవింద్ ఆరా
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(ఫైల్ ఫోటో)
  • Share this:
కేరళలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరాతీశారు. ఈ విషయమై రాష్ట్రపతి కోవింద్ తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కష్ట సమయంలో కేరళ ప్రజలు ప్రదర్శిస్తున్న తెగువను రాష్ట్రపతి అభినందించినట్లు ఓ ట్వీట్లో విజయన్ వెల్లడించారు.

కాగా హెల్ప్ లైన్ నెంబర్లకు ఎవరూ సాయం కోరుతూ ఉత్తుత్తి మెసేజ్‌లు పంపొద్దని సీఎం పినరయి విజయన్ మరో ట్వీట్‌లో కోరారు . హెల్ప్ లైన్లకు ఆకతాయిలు కాల్స్ చేయడం, సహాయం కోరడం ద్వారా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందన్నారు.వర్షాలు తెరపి ఇవ్వడంతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపధికన చేపడుతున్నారు. సాయుధ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, పారామిలిటరీ దళాలు,  స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 10 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. .కేరళలో కొనసాగుతున్న రిస్క్యూ ఆపరేషన్...ప్రపంచంలోనే అతిపెద్ద రిస్క్యూ ఆపరేషన్లలో ఒకటిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్ పేర్కొన్నారు. అటు న్యూస్ 18 కూడా వరద సహాయక చర్యల్లో తన వంతు సహాయ, సహకారాలు అందిస్తోంది.
Published by: Janardhan V
First published: August 19, 2018, 4:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading