Home /News /national /

PRESIDENT ELECTIONS 2022 VENKAIAH NAIDU TAMILISAI SOUNDARARAJAN DRAUPADI MURMU ARIF MOHAMMAD KHAN ANUSUIYA UIKEY ARE IN THE RACE FOR PRESIDENT POST SK

President Elections: రాష్ట్రపతి రేసులో ఉన్నది వీళ్లేనా? అది వర్కవుట్ అయితే వెంకయ్యనాయుడే ప్రెసిడెంట్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

President Elections: రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో.. ఆ పదవికి పోటీ పడే వారు ఎవరనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ ఎవరూ అభ్యర్థులను ప్రకటించకున్నా.. కొందరి పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి.

  ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాష్ట్రపతి ఎన్నికలే (President Elections) హాట్ టాపిక్‌గా ఉంది. ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌కి షెడ్యూల్ విడుదలవడంతో.. తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అత్యున్నత పదవివి పోటీ పడే అభ్యర్థులు ఎవరనే అంశం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇటు అధికారంలో ఉన్న బీజేపీ గానీ, అటు విపక్షాలు గానీ.. అభ్యర్థులను ప్రకటించలేదు. సరైన అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఐతే అంతలోనే కొందరి పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad khan), ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu), తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan), అస్సాం గవర్నర్ జగ్దీష్ ముఖి (Jagdish Mukhi), ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము (Draupadi Murmu), ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ యూకీ (Anasuya Ukey)లో ఒకరిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్  (Nirmala Sitaraman) కూడా రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) పేరు కూడా తెరపైకి వస్తుంది. బీహార్‌లో అధికారాన్ని బీజేపీ తీసుకొచ్చేందుకు వీలుగా.. అక్కడి సీఎంను గౌరవప్రదంగా తప్పించేందుకు.. రాష్ట్రపతి పదవిని ఇవ్వచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  దేశ తదుపరి రాష్ట్రపతి ఎవరు ? మోదీ మనసులో ఉన్నదెవరు ? మెజార్టీకి బీజేపీ ఎంత దూరమంటే..

  విపక్ష కూటమి నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ (Meira Kumar) కూడా రేసులో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను బరిలో దించనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నారు. ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉందని.. అలాంటప్పుడు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగితే... ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు ఎన్సీసీ వర్గాలు గతంలోనే తెలిపాయి. కానీ కొన్ని రోజుల క్రితం ఎన్నికల వ్యూహకర్రత ప్రశాంత్ కిశోర్.. శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.  గత రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత సామాజిక సమీకరణాల దృష్ట్యా.. రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ ఎంపిక చేసింది. ఈసారి ఆదివాసీలు లేదా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆదీవాసీలకు ఇవ్వాలనుకుంటే మాత్రం.. ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ యూకీలో ఒకరిని ఎంపిక చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో ద్రౌపది ముర్ము పేరే ప్రధానంగా వినిపించింది. కానీ అనూహ్యంగా రామ్‌నాథ్ కోవింద్‌ను బరిలోకి దించింది ఎన్డీయే. ఈ నేపథ్యంలో ఈసారి ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇటీవల దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఈసారి అక్కడి నుంచే అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలూ లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ నిర్మల సీతారామన్‌లో ఒకరిని ఎంపిక చేయవచ్చని టాక్ వినిపిస్తోంది.

  President Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలకు మోగిన నగారా.. ఆ రోజే ఎన్నికలు.. ఈసీ ప్రకటన

  రాష్ట్రపతి ఎన్నికల వేళ తాజాగా ఓ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. మనదేశంలో ఇప్పటి వరకు 13 మంది ఉపరాష్ట్రపతులుగా పనిచేశారు. వారిలో తొలి ముగ్గురు రాష్ట్రపతి అయ్యారు. తదుపరి ముగ్గురిలో రాష్ట్రపతి కాలేదు. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురిని ఆ అత్యున్నత పదవి వరించింది. మళ్లీ ముగ్గురికి రాష్ట్రపతి పదవి దక్కలేదు. ఒకవేళ ఈ సెంటిమెంట్ ఫలిస్తే.. నెక్ట్స్ ముగ్గురూ రాష్ట్రపతి అవ్వాలి. ఒకవేళ అదే జరిగితే.. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి పదవి వరిస్తుంది. మరి ఈసారి ఎవరు రాష్ట్రపతి అవుతారన్నది మరి కొన్ని రోజుల్లో తేలనుంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే స్పష్టత వస్తుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: President Elections 2022, President of India

  తదుపరి వార్తలు