హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Draupadi Murmu: దేశం సమర్థవంతంగా ముందుకు సాగుతోంది.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu: దేశం సమర్థవంతంగా ముందుకు సాగుతోంది.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫైల్ ఫోటో)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫైల్ ఫోటో)

Draupadi Murmu: తొలిదశలో కోవిడ్-19 కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయిందని.. అయినప్పటికీ సమర్థ నాయకత్వం, సమర్థత బలంతో దాని నుండి బయటపడి అభివృద్ధి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించామని రాష్ట్రపతి అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్వాతంత్ర్య సమరయోధులను కొనియాడారు. రిపబ్లిక్ డే సందర్భంగా అధ్యక్షుడు ముర్ము(Draupadi Murmu) చేసిన మొదటి ప్రసంగం ఇది. గత సంవత్సరం భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆమె పేర్కొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు, మనం ఒక దేశంగా కలిసి సాధించిన విజయాలను జరుపుకుంటామని అన్నారు. మనమంతా భారతీయులమని... ఎన్నో మతాలు, ఎన్నో భాషలు మనల్ని విభజించలేదని చెప్పారు. అవన్నీ మనల్ని ఏకం చేశాయని.. అందుకే మనం ప్రజాస్వామ్య గణతంత్రంగా విజయం సాధించామని అన్నారు. ఇది భారతదేశ సారాంశమని కొనియాడారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మనం సాధించిన విజయాల పట్ల గర్వంగా భావిస్తున్నామని రాష్ట్రపతి అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తొలి సంవత్సరాల్లో ఎదురైన సవాళ్లను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. బాబాసాహెబ్ అంబేద్కర్(BR Ambedkar), ఇతర వ్యక్తులు మనకు మ్యాప్‌ను, నైతిక పునాదిని ఇచ్చారని, ఆ మార్గంలో నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే మేం చాలా వరకు జీవించామని, అయితే గాంధీజీ ఆశయాలైన సర్వోదయ ఆశయాలు ఇంకా నెరవేరలేదని భావిస్తున్నామని ఆమె తెలిపారు.

తొలిదశలో కోవిడ్-19 కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయిందని.. అయినప్పటికీ సమర్థ నాయకత్వం, సమర్థత బలంతో దాని నుండి బయటపడి అభివృద్ధి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించామని రాష్ట్రపతి అన్నారు. ఆర్థిక వ్యవస్థలోని చాలా రంగాలు ఇప్పుడు మన అంటువ్యాధి ప్రభావం నుండి బయటపడ్డాయని.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. ప్రభుత్వం సకాలంలో కృషి చేయడం వల్లనే ఇది సాధ్యమైందని... ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పట్ల సామాన్య ప్రజల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రపతి ప్రస్తావించారు.

Congress: సీనియర్ నేతలకు కాంగ్రెస్ నాయకత్వం వార్నింగ్.. ఇకపై అలా జరగవద్దంటూ..

India Map: ఈ లొకేషన్ అచ్చం ఇండియా మ్యాప్‌లా ఉంది కదా? హైదరాబాద్ నుంచి ఎంత దూరమంటే..

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మన దేశ ప్రజలు ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం 2020 మార్చిలో ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను అమలు చేయడం ద్వారా పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించిందని గుర్తు చేశారు. ఈ పథకం వ్యవధిని పదే పదే పొడిగించామని, దాదాపు 81 కోట్ల మంది దేశప్రజలు ప్రయోజనం పొందుతున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ సహాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి 2023 సంవత్సరంలో లబ్ధిదారులందరికీ నెలవారీ రేషన్ అందుతుందని ప్రభుత్వం ప్రకటించిందని ఆమె వివరించారు. ఈ చారిత్రాత్మక అడుగుతో బడుగు బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధితో పాటు వారిని ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు.

First published:

Tags: Draupadi Murmu

ఉత్తమ కథలు