సుప్రీం కోర్టు(Supreme court)కు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. కొలీజియం సిఫారసుతో కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి (President)ద్రౌపది ముర్ము(Draupadi Murmu)ఆమోదం తెలిపారు. రెండు నెలల క్రితమే ఈప్రక్రియ జరగాల్సి ఉండగా న్యాయవ్యవస్థతో పాటు కేంద్ర ప్రభుత్వం మధ్య నలుగుతూ వస్తోంది. చివరకు శనివారం (Saturday)రాష్ట్రపతి ఆమోదంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు జడ్జీ(Five new judges )ల నియామకానికి సంబంధించిన లైన్ క్లియర్ అయింది. ఈవిషయాన్ని స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజూజు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
సుప్రీం కోర్టుకు మరో ఐదుగురు జడ్జీలు..
సుప్రీం కోర్టుకు ఐదుగురు జడ్జీల పేర్లను ఖరారు చేసింది న్యాయమూర్తుల ప్యానెల్. ముగ్గురు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తుల పేర్లతో జాబితా రూపొందించి పదోన్నతి కల్పించాలని డిసెంబర్‌లోనే సుప్రీం కోర్టుకు పంపడం జరిగింది. రెండు నెలల జాప్యంతో ఇప్పుడు పదోన్నతలు పొందుతున్నారు. సుప్రీం కోర్టుకు జడ్జీలుగా రాబోతున్న ఐదుగురి వివరాలను కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజూజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
As per the provisions under the Constitution of India, Hon’ble President of India has appointed the following Chief Justices and Judges of the High Courts as Judges of the Supreme Court. I extend best wishes to all of them. pic.twitter.com/DvtBTyGV42
— Kiren Rijiju (@KirenRijiju) February 4, 2023
ఆమోదించిన రాష్ట్రపతి ...
ఇందులో రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ట్‌గా ఉన్న పంకజ్ మిట్టల్ ఒకరుగా కాగా మిగిలిన నలుగురు పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీవీ సంజయ్‌కుమార్, ఈ ముగ్గురితో పాటు పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అస్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రా పదోన్నతలు పొందనున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో 34మంది జడ్జీలు ఉన్నారు. చీఫ్ జస్టిస్‌లతో పాటు న్యాయమూర్తులు 27మంది ఉన్నారు. కొత్తగా నియమితులైన ఐదుగురితో సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య 32కు చేరనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Supreme Court