Home /News /national /

PRESENTS GIFTED BY PARENTS FOR DAUGHTER WELFARE NOT DOWRY SAYS KERALA HIGH COURT MKS

పెళ్లికూతురుకు తల్లిదండ్రులు ఇచ్చే వస్తువులు, కానుకలు వరకట్నం కిందికి రావు: హైకోర్టు సంచలన తీర్పు

వరకట్నం కేసులో కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ అనిత కీలక తీర్పు

వరకట్నం కేసులో కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ అనిత కీలక తీర్పు

వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు ఆమెకిచ్చే కానుకలు, బహుమానాలు వరకట్నం కిందకు రావని కేరళ హైకోర్టు పేర్కొంది. మహిళ సంక్షేమం కోసం ఇచ్చే కానుకలను వరకట్న నిషేధ చట్టం -1961 కింద లెక్కించరాదని స్పష్టం చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

వరకట్నం తీసుకోవడం, స్వీకరించడం తప్పు. ఇందుకు 1961 వరకట్న నిషేధ చట్టం కింద శిక్షార్హులవుతారు. అయితే ఈ చట్టానికి సరికొత్త నిర్వచనాన్ని జోడించి సంచలన తీర్పునిచ్చింది కేరళ హైకోర్టు. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు ఆమెకిచ్చే కానుకలు, బహుమానాలు వరకట్నం కిందకు రావని పేర్కొంది. ఆమె సంక్షేమం కోసం ఇచ్చే కానుకలను వరకట్న నిషేధ చట్టం -1961 కింద లెక్కించరాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ అనిత ఈ సంచలన తీర్పును వెలువరించారు. "వివాహ సమయంలో ఎదుటి పక్షం వారు ఎలాంటి డిమాండ్ చేయకుండా వధువు సంక్షేమం కోసం ఇచ్చే కానుకలు, ఇతర బహుమానాలు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3(1) కిందకు రావు. ఇది వరకట్న నిబంధనలపై ప్రభావం చూపదు" అని తీర్పు చెప్పారు.

తన భార్య కేఎస్ దీప్తిపై ఈ వ్యాజ్యం వేశారు పిటిషనర్ (పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు). అతని వ్యాజ్యంలో పేర్కొన్న సమాచారం ప్రకారం.. దీప్తితో ఆయనకు 2020లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె తన భర్తతో(పిటిషనర్) కలిసి ఒకే నివాసంలో ఉండేవారు. అనంతర కాలంలో వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దీప్తి విడాకులనే కాకుండా కట్నం కోసం వేధించారని డౌరీ నోడల్ అధికారి ద్వారా తన భర్తకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

Karepalli : అయ్యో మనీషా.. ఎంతపని చేశావమ్మా.. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు..



దీంతో ఆమె భర్త ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరో వ్యాజ్యాన్ని వేశారు. పిటిషనర్ తరఫున లాయర్లు కేఆర్ ప్రదీప్, హరీష్ ఎంఆర్ రష్మి నాయర్. టీ బిజూ, టీ తాస్మీ, ఎంజే అనుపా వాదించారు. సదరు ప్రతివాదికి చెందిన ఆభరణాలను కట్నంగా ఇవ్వలేదని, ఆమె భద్రత కోసం వారి కుటుంబ సభ్యులే బ్యాంక్ లాకర్​లో ఇద్దరి(భార్య, భర్తలిద్దరు) పేరుమీద ఉంచారని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ లాకర్ తాళంచెవి కూడా దీప్తి వద్దనే ఉందని తెలిపారు. అందువల్ల ఈ విషయంలో జిల్లా వరకట్న నిషేధ అధికారికి ఎలాంటి సంబంధం లేదని, ఆయన అధికార పరిధి కిందకు ప్రస్తుత సమస్య రాదని వాదించారు. అంతేకాకుండా లాకర్ తాళాన్ని ఇంతవరకూ తిరిగి ఇవ్వలేదని కూడా గుర్తు చేశారు. ప్రతివాదుల తరఫున కేవీ అనిల్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంగీత్​రాజ్ వాదించారు.

Hyderabad : శిల్పా చౌదరికి మళ్లీ షాక్ -ఆ పనికి భర్తను వాడుకోలేదా? -కోర్టు అనూహ్య తీర్పు



ఈ అంశంపై న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. సదరు ప్రతివాదికి ఆభరణాలు కానుకల (గిఫ్ట్స్) రూపంలోనే వచ్చాయని, అంతేకాకుండా బ్యాంక్ లాకర్ కూడా ఆమె నిర్బంధంలోనే ఉందని కోర్టు గ్రహించింది. ఎలాంటి డిమాండ్ చేయకుండానే ఆమెకు కానుకల రూపంలో ఇచ్చిన ఆభరణాలను కట్నంగా లెక్కించలేమని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

* వరకట్న నిషేధ చట్టం..
వరకట్న నిషేధ చట్టం 1961 మే 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇది కట్నం ఇవ్వడం లేదా స్వీకరించడాన్ని నిరోధిస్తుంది. ఈ చట్టం ప్రకారం వరకట్నం తీసుకోవడం చట్టవిరుద్ధంగా మారింది. భారతదేశంలో శతాబ్దాల నుంచి వరకట్నం ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం కొనసాగుతోంది. దక్షిణాదికి చెందిన ఈ సంప్రదాయంలో వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు వరుడి కుటుంబానికి నగదు, బట్టలు, ఆభరణాలు లాంటివి బహుమతిగా ఇస్తారు.
Published by:Madhu Kota
First published:

Tags: Dowry, Dowry demand, Dowry harassment, High Court, Kerala

తదుపరి వార్తలు