Home /News /national /

PRASHANT KISHORE INTERESTING COMMENTS ON RAHUL GANDHI AND PM NARENDRA MODI AK

Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని కావొచ్చన్న ప్రశాంత్ కిశోర్.. మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ ( పైల్ ఫోటో)

రాహుల్ గాంధీ ( పైల్ ఫోటో)

Prashant Kishor: గాంధీ కుటుంబం లేకుండా కూడా కాంగ్రెస్ నడుస్తుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. ఇతర కాంగ్రెస్ నేతలు ఇందుకు ముందుకొస్తే ఇది సాధ్యమవుతుందని అన్నారు.

    ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్.. కొన్నేళ్లుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం బెంగాల్‌లో మమత బెనర్జీ అఖండ విజయానికి వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిశోర్.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు ప్రయత్నాలు చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంకతో ఈ మేరకు ఆయన చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీతో కలిపి పని చేయాలనుకున్న ప్రశాంత్ కిశోర్ ఆలోచన మారింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు ప్రశాంత్ కిశోర్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

    ఇదిలా ఉంటే తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్.. పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లేకుండా కూడా దేశంలో బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేయవచ్చని మరోసారి పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్‌లో 2017 కంటే 2022లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పారు. భారతదేశంలోని ఏ నాయకుడితో మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటున్నారు అని ప్రశాంత్ కిశోర్’‌ను అడగగా.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడుతూనే ఉన్నానని అన్నారు.

    మీరు ఏ నాయకుడితో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు? అని ప్రశ్నించినప్పుడు ఆయన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పేరును చెప్పారు. రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, కెప్టెన్ అమరీందర్ సింగ్, మమతా బెనర్జీ పేర్లలో ఆయన అమరీందర్ సింగ్ పేరును తీసుకున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని భావిస్తున్నారా ? అనే అంశంపై పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగలరని అన్నారు.

    Aadhaar Linked Voter IDs : మోదీ సర్కార్ సంచలనం -ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ సహా కేబినెట్ నిర్ణయాలివే..

    Legal Marriage Age: చైనాలో 20, ట్రినిడాడ్ లో 12... ప్రపంచ వ్యాప్తంగా మహిళల కనీస వివాహ వయసు ఎంతంటే..

    అయితే గాంధీ కుటుంబం లేకుండా కూడా కాంగ్రెస్ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇతర కాంగ్రెస్ నేతలు ఇందుకు ముందుకొస్తే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఏ పార్టీలో చేరాలన్న అంశంపై మాట్లాడిన ప్రశాంత్ కిశోర్.. సొంత పార్టీ కూడా పెట్టుకోవచ్చని అన్నారు. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు, ఆయనతో సరితూగే నాయకుడు దేశంలో ప్రస్తుతం ఎవరూ లేరని అన్నారు. దీంతో పాటు కాంగ్రెస్‌ లేకుండానే దేశంలో బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేయవచ్చని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Prashant kishor, Rahul Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు