Home /News /national /

బెంగాల్‌లో ప్రశాంత్ కిశోర్ ఆడియో కలకలం.. మమత పార్టీలో టెన్షన్.. అసలేం జరిగిందంటే..

బెంగాల్‌లో ప్రశాంత్ కిశోర్ ఆడియో కలకలం.. మమత పార్టీలో టెన్షన్.. అసలేం జరిగిందంటే..

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

West Bengal assembly elections 2021: బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

    పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా ? లేక బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందా ? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కొద్దిపాటి మెజార్టీతో అయినా మమత మళ్లీ అధికారంలోకి వస్తారని కొన్ని సర్వేలు చెప్పినా.. బీజేపీ పుంజుకునే అవకాశం లేకపోలేదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

    బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రజలు భావిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఆడియో టేప్ పై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఆడియో కాదని ఖండిస్తున్నారు. ఆడియోలో కొంత భాగం కాదు..మొత్తం ఆడియో చాట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ లో బీజేపీ 100 స్థానాలకు మించి గెలవదని ప్రశాంత్ జోస్యం చెప్పారు.

    ఇదిలా ఉంటే బెంగాల్ బాధ్యతలు ముగిసిన అనంతరం పంజాబ్ రాష్ట్రానికి ప్రశాంత్ కిశోర్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పీకే ప్రయత్నాలు చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం అమరీందర్ సింగ్‌కు ప్రశాంత్ కిశోర్ ప్రిన్స్‌పల్ అడ్వైజరీగా నియమితులయ్యారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: 5 State Elections, Prashant kishor, West Bengal Assembly Elections 2021

    తదుపరి వార్తలు