కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరిక ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో అధినేత్రి సోనియా గాంధీ శనివారం జరిపిన కీలక భేటీలో పీకే కూడా పాల్గొన్నారు. ఏం మాట్లాడుకున్నారంటే..
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరిక ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో అధినేత్రి సోనియా గాంధీ శనివారం జరిపిన కీలక భేటీలో పీకే కూడా పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, రెండేళ్ల తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో పటిష్టమైన వ్యూహరచన కోసం కాంగ్రెస్ తలపెట్టిన చితన్ శిబిర్ లేదా చింతన్ బైఠక్పై చర్చించిన ఈ సమావేశంలోనే పీకే చేరికపైనా సోనియా గాంధీ నేతలతో మాట్లాడినట్లు సమాచారం. పీకే సైతం మే 6లోగా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, చింతన్ బైఠక్ కంటే ముందుగానే చేరికను ప్రకటించే అవకాశాలున్నాయి..
కాంగ్రెస్ లో చరికపై ప్రశాంత్ కిషోర్ గత రెండు, మూడు నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తుండటం, ఇప్పటికే పలు మార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పలు మార్లు భేటీ కావడం తెలిసిందే. పీకే ప్రతిపాదించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ, ఆయనను చేర్చుకునే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతోంది. అయితే, కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో స్పష్టమైన నిర్ణయం వెలువరించాలని అధినేత్రి సోనియా డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతోపాటే చింతన్ బైఠక్ తీరుతెన్నులు, అజెండా, భేటీ తేదీలను చర్చించడానికే సోనియా శనివారం నాటి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పీకేను కూడా పిలవడం ద్వారా ఆయన చేరికపై అధినేత్రి పాజిటివ్ సిగ్నల్స్ పంపినట్లయింది.
CM KCR: కేసీఆర్ దూకుడు.. మళ్లీ ఢిల్లీకి.. ఈసారి లఖీంపూర్ ఖేరీ సందర్శన.. బీజేపీపై పోరు ఉధృతం!
తన రాజకీయ భవిష్యత్తుగా మే 6లోగా కచ్చితంగా ఏదోఒక నిర్ణయం తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించిన దరిమిలా ఆలోపే కాంగ్రెస్ లోకి చేరికపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో శనివారం జరిగిన సమావేశంలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తోపాటు కాంగ్రెస్ ఉన్నత స్థాయి నేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. సమావేశంలో సోనియా.. నేతలకు పీకేను పరిచయం చేయడమే కాకుండా, చింతన్ బైఠక్ అజెండా రూపకల్పనలో వ్యూహకర్త సలహాలనూ స్వీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సంబంధించి చింతన్ బైఠక్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కాంగ్రెస్.. దాని అజెండా ఖరారు కోసం నిర్దేశించిన సమావేశానికి ప్రశాంత్ కిషోర్ ను పిలవడం ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చినట్లయింది. పీకే వ్యక్తిగత డెడ్ లైన్ మే 6లోపే కాంగ్రెస్ చింతన్ బైఠక్ కూడా ఉంటుందని, దానికంటే ముందు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ భేటీ జరుగుతుందని, మొత్తంగా పీకే చేరికపై రెండు వారాల్లోపే అధికారిక ప్రకటన వెలువడొచ్చని చర్చ జరుగుతోంది.
కేవలం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు చర్చించేందుకే సోనియాతో పీకే భేటీ అయ్యారనే వాదనను పీకే సన్నిహితులు తోసిపుచ్చారు. కాంగ్రెప్ పెద్దలతో ప్రశాంత్ కిషోర్ భేటీ పార్టీలో చేరికను ఉద్దేశించిందేనని పీకే సన్నిహితులు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. పీకే శిష్యుడైన మరో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు(ఎస్కే) ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలిసిందే. అయితే సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ లో చేరగా, పీకే కూడా కార్యకర్తగానే చేరుతారా, లేక కార్యదర్శి హోదాలోనే ఎంట్రీ ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.