PRASHANT KISHOR EXPELLED FROM JDU TWEETS THANK YOU NITISH KUMAR MK
Prashant Kishor: ఏపీ సీఎం జగన్ వ్యూహకర్తకు షాక్...పార్టీ నుంచి సస్పెన్షన్...
ప్రశాంత్ కిశోర్ (File Photo)
JDU పార్టీలో ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) పార్టీ నిబంధనలకు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఏపీ సీఎం జగన్ తో పాటు దేశంలో పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ను జేడీయూ నుంచి బహిష్కరించారు. JDU పార్టీలో ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రశాంత్ కిషోర్ పార్టీ నిబంధనలకు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రశాంతకిషోర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ థాంక్యూ నితీశ్ కుమార్. మీరు మరోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని ట్వీట్ చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) తోపాటు పవన్ శర్మను సైతం పార్టీ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జేడీయూ బీహార్ లో బీజేపీ మిత్ర పక్షంతో అధికారంలో కొనసాగుతున్నప్పటికీ, ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఇవేవీ పట్టించుకోకుండా, బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఉపాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఇరు పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సైతం ప్రశాంత్ కిషోర్‌ను పలుమార్లు మందలించారు. అయినా పీకే ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జేడీయూలో కొనసాగాలంటే పార్టీలోకి నిబంధనలు, విధానాలకు లోబడి పనిచేయాలని.. లేనట్లయితే పార్టీని వీడవచ్చంటూ నితీశ్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor)ను ఉద్దేశించి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Thank you @NitishKumar. My best wishes to you to retain the chair of Chief Minister of Bihar. God bless you.🙏🏼
ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా వ్యవహరించారు. దీంతో అతడిని ఔట్ సోర్సింగ్ పనులకు పరిమితం చేయకుండా, నేరుగా ఉపాధ్యక్షుడి హోదా కట్టబెట్టి పార్టీలో స్థానం కల్పించారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ట్వీట్ లు చేస్తున్నారు. అంతేకాదు రాజకీయ వ్యూహకర్తగా అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనపై బీజేపీ గుర్రుగా ఉంది.
అలాగే అటు కాంగ్రెస్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఏఏ(CAA), ఎన్ఆర్సీ(NRC)వ్యతిరేక ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అభినందిస్తూ ఆయన ట్వీట్లు సైతం చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేశారు. అంతేకాదు షాహీన్‌బాగ్ ఘటనపై సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకంగా ట్వీట్లు సైతం చేశారు.
అయితే ఈ పరిణామాలను గమనించిన బీజేపీ నాయకత్వం ప్రశాంత్ కిషోర్ విషయంలో గుర్రుగా ఉంది. పీకేను ఎలాగైనా కంట్రోల్ లో పెట్టాలని నితీష్‌ను బీజేపీ కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై నితీష్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల సీఎం నితీష్ బహిరంగంగానే ప్రశాంత్ జేడీయూకి రాజీనామా చేసి బయటకు వెళ్తారా లేక సంజాయిషీ ఇస్తారా అని అడిగినట్లు సమాచారం. కాగా ప్రశాంత్ కిషోర్ 2019 ఏపీ శాసన సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసి, వైఎస్ జగన్ సీఎం కావడంలో కీలక పాత్ర పోషించారు.