PRASHANT KISHOR DECLINES SONIA GANDHI OFFER TO JOIN CONGRESS AICC LEADER RANDEEP SURJEWALA CONFORMS MKS
Prashant Kishor | Congress: సారీ మేడం.. నేను కాంగ్రెస్లో చేరట్లేదు: సోనియాకు భారీ షాకిచ్చిన పీకే
పీకే, సోనియా
కాంగ్రెస్ లో చేరాలంటూ అధినేత్రి సోనియా గాంధీ ఆహ్వానించగా, సదరు ఆఫర్ ను పీకే తిరస్కరించారు. తాను కాంగ్రెస్ లో చేరడంలేదని ఎన్నికల వ్యూహకర్త కుండబద్దలుకొట్టారు. ఈ విషయం అధికారికంగా వెల్లడైంది.,
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరిక అంశంపై కొద్ది రోజులుగా సాగుతోన్న హైడ్రామాకు తెరపడింది. పార్టీ బలోపేతానికి పీకే రచించిన వ్యూహాలను మెచ్చి కాంగ్రెస్ లో చేరాల్సిందిగా అధినేత్రి సోనియా గాంధీ ఆహ్వానించగా, సదరు ఆఫర్ ను పీకే తిరస్కరించారు. తాను కాంగ్రెస్ లో చేరడంలేదని ఎన్నికల వ్యూహకర్త కుండబద్దలుకొట్టారు. ఈ విషయాన్ని పీకే స్వయంగానూ వెల్లడించగా, ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సైతం ధృవీకరించారు. పార్టీని ఉద్దేశించి పీకే చేసిన వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగానూ ఆయన కొనసాగే అవకాశాలు లేవు.
పీకే చేరిక అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అధికారిక ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మంగళవారం కీలక ప్రకటన చేశారు. పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ను ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారని సుర్జేవాలా స్పష్టం చేశారు. ‘ప్రశాంత్ కిషోర్ వ్యూహాల ప్రెజెంటేషన్, చర్చల తర్వాత ఆయన చెప్పిన అంశాలపై కాంగ్రెస్ అధినేత్రి.. ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024’ని ఏర్పాటు చేసారు. కాగా, నిర్వచించిన బాధ్యతతో గ్రూప్లో భాగంగా పార్టీలో చేరాల్సిందిగా పీకేను ఆహ్వానించారు. కానీ అందుకు ఆయన నిరాకరించారు. అయితే, ఆయన చేసిన కృషిని, పార్టీకి అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చినందుకు ఆయనను అభినందిస్తున్నాం’అని సుర్జేవాలా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party.
కాంగ్రెస్ లో చేరికను పీకే తిరస్కరించారంటూ ఏఐసీసీ ప్రకటన చేసిన కొద్దిసేపటికే స్వయంగా పీకే సైతం తన అధికార ట్విటర్ ఖాతాలో ఓ పోస్టుపెట్టారు. నాయకత్వలేమి, నిర్ణయాలు తీసుకోవడంలో సంకల్పలోపాలపై పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్(EAG)లో భాగంగా పార్టీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ చేసిన ఉదారమైన ప్రతిపాదనను నేను తిరస్కరించాను. నా వినయపూర్వకమైన అభిప్రాయం ఏంటంటే.. నిర్మాణపరమైన సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి నా అవసరం కంటే నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరం’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
I declined the generous offer of #congress to join the party as part of the EAG & take responsibility for the elections.
In my humble opinion, more than me the party needs leadership and collective will to fix the deep rooted structural problems through transformational reforms.
కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ గతేడాది నుంచి చర్చలు జరుపుతుండటం తెలిసిందే. గతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన చర్చలు మళ్లీ ఈ నెలలో పున:ప్రారంభం కావడం, రోజుల వ్యవధిలోనే పీకే పలు మార్లు సోనియా గాంధీ, ఇతర సీనియర్లతో భేటీ కావడం, కాంగ్రెస్ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను పీకే ప్రెజెంట్ చేయడం, ఆ సమావేశాల క్రమంలోనే ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం లాంటి పరిణామాలు జరిగాయి. అయితే, కాంగ్రెస్ లో చేరాలంటే ఐపాక్ సంస్థతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని, ఎన్నికల వ్యూహాల వ్యాపారాన్ని మానేయాలని పీకేకు హైకమాండ్ కండిషన్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో అందుకు సిద్ధమైన పీకే చివరికి తనదైన శైలిలో భిన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.