Prashant Kishor| ప్రశాంత్ కిషోర్ ఒక బచ్చా...బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు...

Prashant Kishor | అధికార తృణమూల్ కాంగ్రెస్‌ మళ్లీ అధికారం చేపట్టేందుకు పశ్చిమబెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై బెంగాల్ బీజేపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు.

news18-telugu
Updated: June 9, 2019, 9:56 AM IST
Prashant Kishor| ప్రశాంత్ కిషోర్ ఒక బచ్చా...బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు...
ప్రశాంత్ కిశోర్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: June 9, 2019, 9:56 AM IST
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఒక బచ్చా అని బీజేపీ పశ్చిమబెంగాల్ నేత కైలాష్ విజయవర్గీయ అన్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ మళ్లీ అధికారం చేపట్టేందుకు పశ్చిమబెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై బెంగాల్ బీజేపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను సీఎం మమతా బెనర్జీ నియమించుకోవడం పట్ల బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ తప్పుపట్టారు. తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను మించి వ్యూహకర్త ఎవరూ లేరని ఆయన అన్నారు. అమిత్ షా కాలేజీ ప్రిన్సిపాల్ అయితే ఆ కాలేజీలో ప్రశాంత్ కిషోర్ ఒక స్టూడెంట్ అని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో తృణమూల్ పార్టీ గట్టి పోటీ ఎదుర్కొంది. బీజేపీ ఏకంగా 18 సీట్లు గెలవడంతో మమతా దీదీ పరిస్థితిని చక్క దిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సైతం వైసీపీ అధికారంలో వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ సేవలను జగన్ వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మమత సైతం ప్రశాంత్ కిషోర్ వైపే మొగ్గు చూపుతున్నారు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...