ప్రశాంత్ కిషోర్‌పై పలువురు రాజకీయ నాయకులు దాడి చేస్తున్నారు. పాదయాత్రకు(Padayatra) డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. తాజాగా దీనిపై స్పందించారు పీకే. తనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిపారు. గత పదేళ్లలో తాను ఎన్నో రాజకీయ పార్టీలకు సాయం చేశానన్నారు. వాళ్లే ఇప్పుడు సాయం చేస్తారని అన్నారు. గత పదేళ్లలో తాను 11 మంది కోసం ఎన్నికల్లో(Elections) పని చేశానని అన్నారు. వీరిలో 10 మంది విజయం సాధించారని చెప్పారు. వీరి నుంచి ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని వెల్లడించారు. ఇప్పుడు వారు సహాయం కోసం అడుగుతున్నారని.. ఈ రోజు డబ్బు అవసరమని అన్నారు. ప్రస్తుత కాలంలో ఆరుగురు సీఎంలు(Chief Ministers) తమ కారణంగా అధికార పీఠాన్ని అధిరోహించి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.
ఆ ఆరుగురు ముఖ్యమంత్రులు కాస్త సాయం చేసినా సరిపోతుందని ముక్తసరిగా చెప్పారు. రాజకీయ నాయకులు హెలికాప్టర్ల వినియోగానికి అత్యధికంగా ఖర్చు చేస్తారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అంతే కాకుండా బస్సుల్లో జనాన్ని తీసుకురావడానికి కూడా చాలా ఖర్చు అవుతుందని అన్నారు. వేదిక నిర్మాణానికి, మైదానాల బుకింగ్‌కు, ప్రకటనలకు కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
అయితే ఈ నాలుగు పనుల్లో తాము ఒక్కటి కూడా చేయడం లేదని చెప్పారు. బస్సు నింపి ఎవరినీ పిలవనని పీకే అన్నారు. నేటి వరకు పెట్రోలుకు పైసా కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఎప్పుడూ గ్రౌండ్ బుక్ చేసుకోలేదు, స్టేజి కట్టలేదు. రోడ్డు పక్కన నిలబడి ప్రజలను కలుస్తారు. బీహార్‌లో ఒక్కరు కూడా తన వద్ద డబ్బులు తీసుకున్నారని చెప్పలేరని ప్రశాంత్ కిశోర్ వివరించారు.
Asaduddin Owaisi | Bjp: హిజాబ్ ధరించిన మహిళ భారత్ ప్రధాని కావాలి : అసదుద్దీన్.. ఎంఐఎంకి బీజేపీ ఇచ్చిన కౌంటర్ ఏమిటంటే ..
ప్రస్తుతం బీహార్‌లో పీకే పాదయాత్ర చేపట్టారు. ఇతర పార్టీల నేతలు ఆయనపై నిత్యం విరుచుకుపడుతున్నారు. పీకే ఒకప్పుడు నితీష్ కుమార్ స్నేహితుడు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య తీవ్ర టెన్షన్ నెలకొంది. రెండ్రోజుల క్రితమే వీరిద్దరూ సమావేశమైనప్పటికీ ఇరువర్గాల నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prashant kishor