pranab mukherjee: ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు

pranab mukherjee: హెల్త్ బులెటిన్‌పై ఇవాళ ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యంపై చాలా మంది వదంతులు వ్యాప్తిచేస్తున్నారు.

news18-telugu
Updated: August 13, 2020, 9:37 AM IST
pranab mukherjee: ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు
ప్రణబ్ ముఖర్జీ (File)
  • Share this:
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నా.. ఆయన ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నాలుగు రోజులుగా ఆయన ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉందని బుధవారం డాక్టర్లు చెప్పారు. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపారు.

ఐతే ఆయన హెల్త్ బులెటిన్‌పై ఇవాళ ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యంపై చాలా మంది వదంతులు వ్యాప్తిచేస్తున్నారు. వీటిని ప్రణబ్ కూతురు షర్మిష్ట ఖండించారు. పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.



తన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ప్రణబ్ కూతురు షర్మిష్ట కృతజ్ఞతలు తెలిపారు. ఐతే నాన్న ఆరోగ్యం ఇక భగవంతుడి చేతుల్లోనే ఉందని బుధవారం ఆమె ట్వీట్ చేశారు. గత ఏడాది ఆగస్టు 8న తన తండ్రి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకుననారని.. ఏడాది తిరగ్గానే ఆగస్టు 10న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని భావోద్వేగానికి లోనయ్యారు షర్మిష్ట. అంతా భగవంతుడి చేతుల్లో ఉందని పేర్కొన్నారు.


తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సోమవారం ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలంటూ అన్ని పార్టీల నేతలు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading