• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PRANAB MUKHERJEE RENAL PARAMETERS ARE SLIGHTLY DERANGED AND HE CONTINUES TO BE IN DEEP COMA AND ON VENTILATOR SUPPORT NK

Pranab Mukhergee: ప్రణబ్‌ముఖర్జీ హెల్త్ అప్‌డేట్... డాక్టర్లు ఏమన్నారంటే...

Pranab Mukhergee: ప్రణబ్‌ముఖర్జీ హెల్త్ అప్‌డేట్... డాక్టర్లు ఏమన్నారంటే...

ప్రణబ్‌ముఖర్జీ (File Image)

Pranab Mukhergee: ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఎలా ఉందో తాజా బులిటెన్ ద్వారా డాక్టర్లు తెలిపారు.

  • Share this:
    Pranab Mukhergee Health: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైందని మొన్ననే... ప్రణబ్ కొడుకు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి డాక్టర్లు మరోరకమైన విషయం చెప్పారు. ప్రణబ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ట్రీట్‌మెంట్ పొందుతున్నారన్న డాక్టర్లు... ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందన్నట్లు చెప్పారు. నిన్నటి నుంచి ప్రధాన అవయవాల స్పందన స్వల్పంగా తగ్గిందన్నారు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ డీప్ కోమాలో ఉన్నారనీ... వెంటిలేటర్ సపోర్టుతో ఉన్నారని డాక్టర్లు తాజా బులిటెన్ ద్వారా వివరించారు. డీప్ కోమాలోకి వెళ్లిపోవడంతో ప్రణబ్ మెడికల్ కండీషన్‌ను అంచనా వెయ్యడం డాక్టర్లకు కష్టమవుతోంది.

    ప్రణబ్ ముఖర్జీ రెండు వారాలుగా ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది.

    తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆస్పత్రిలో చేరినప్పుడు ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రణబ్ ముఖర్జీకి రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు (multiple old co-morbidities) ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం... ఆయన్ని దగ్గరుండి చూసుకుంటోందని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు రోజూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు. తద్వారా ప్రణబ్ ఆరోగ్యం ఎలా ఉందో దేశ ప్రజలకు తెలుపుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: