• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PRANAB MUKHERJEE HEALTH DECLINES HE IS IN SEPTIC SHOCK SAYS ARMY HOSPITAL NK

Pranab Mukhergee: క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం... డాక్టర్లు ఏమన్నారంటే...

Pranab Mukhergee: క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం... డాక్టర్లు ఏమన్నారంటే...

Pranab Mukhergee: ప్రణబ్ ముఖర్జీ (File)

Pranab Mukhergee: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు.

  • Share this:
    Pranab Mukhergee Health: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన డీప్ కోమాలో ఉన్నారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ డాక్టర్లు తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. నిన్నటికీ ఇవాళ్టికీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలిపారు. ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల ప్రణబ్ ముఖర్జీ సెప్టిక్ షాక్‌లో ఉన్నారని వివరించారు. డీప్ కోమాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం అని డాక్టర్ల బృందం తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ 20 రోజుల నుంచి ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది.


    తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రణబ్ ముఖర్జీకి రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు (multiple old co-morbidities) ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం... ఆయన్ని దగ్గరుండి చూసుకుంటోందని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు రోజూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు. తద్వారా ప్రణబ్ ఆరోగ్యం ఎలా ఉందో దేశ ప్రజలకు తెలుపుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు