• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PRANAB MUKHERJEE FORMER PRESIDENT OF INDIA DIES AT 84 FLAG AT PARLIAMENT LOWERED TO HALF MAST FUNERAL IN DELHI TODAY SK

Pranab Mukherjee: నేడు అంత్యక్రియలు.. వారం పాటు సంతాప దినాలు

Pranab Mukherjee: నేడు అంత్యక్రియలు.. వారం పాటు సంతాప దినాలు

ప్రణబ్‌ముఖర్జీ (File Image)

Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీకి నేడు ఢిల్లీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

  • Share this:
    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు ఏడు రోజుల పాటు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  పార్లమెంట్‌, రాష్ట్రపతిభవన్‌ సహా అన్ని కార్యాలయాలపైనా జాతీయ జెండాను అవనతం చేశారు.  ప్రణబ్ ముఖర్జీకి నేడు ఢిల్లీలో అధికారిక   లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    భారతరత్న ప్రణబ్ ముఖర్జీ పార్థీవ దేహాన్ని ఇవాళ ఉదయం 9 గంటలకు ఆర్మీ ఆస్పత్రి నుంచి ప్రణబ్ ఇంటికి తరలిస్తారు. ఆ తర్వాత ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఇందులో భాగంగా ఉదయం 9.15 నుంచి 10.15 వరకు నేతలు, అధికారులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులు సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ... ప్రణబ్ పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10.15 నుంచి 11.00 వరకు ఇతర ప్రభుత్వ సిబ్బంది సందర్శిస్తారు. ఉదయ 11.00 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సాధారణ ప్రజలు సందర్శిస్తారు. ఈ సందర్భంగా కరోనా ఉంది కాబట్టి అందరూ కరోనా రూల్స్ పాటిస్తారు.

    ప్రణబ్ అంత్యక్రియల షెడ్యూల్


    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 10న అనారోగ్యంతో ప్రణబ్ ముఖర్జీ ఆస్పత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆర్మీ ఆర్‌ఆర్ డాక్టర్లు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కరోనా కూడా కూడా నిర్ధారణ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాలేవీ పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దాదాను బతికించేందుకు డాక్టర్లు అహర్నిశలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు