• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PRANAB MUKHERJEE EX PRESIDENT PRANAB MUKHERJEE IS NO MORE SK

Pranab Mukherjee: దాదా ఇకలేరు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

Pranab Mukherjee: దాదా ఇకలేరు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ప్రణబ్ ముఖర్జీ(ఫైల్ ఫోటో)

Pranab Mukherjee: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

  • Share this:
    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఇక లేరు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు ప్రారంభంలో ప్రణబ్ ముఖర్జీకి ఆర్మీ ఆర్‌ఆర్ డాక్టర్లు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కరోనా కూడా కూడా నిర్ధారణ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాలేవీ పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దాదాను బతికించేందుకు డాక్టర్లు అహర్నిశలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు.

    తన తండ్రి చనిపోయారన్న వార్తను బరువెక్కిన హృదయంతో వెల్లడిస్తున్నట్లు ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. డాక్టర్ల కృషితో పాటు దేశప్రజలంతా ప్రార్థనలు చేసినప్పటికీ ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారని పేర్కొన్నారు.


    ప్రణబ్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్‌లోని మిరితిలో జన్మించారు. 2012, జులై 25 నుంచి 2017, జులై 25 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. 1969లో ఇందిరా గాంధీ హయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 1973లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా, ఆర్థిక మంత్రిగానూ సేవలందించారు. 2012లో యూఏపీ మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచి పీ.ఏ. సంగ్మాను ఓడించారు. 70శాతం ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ.

    రాజకీయాల్లోకి రాకముందు తపాలాశాఖలో యూడీసీగా పనిచేశారు. పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గానూ సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌‌గా ఆయకు పేరుంది. కాంగ్రెస్ పార్టీలో మూడు తరాల నేతలతోనూ ప్రణబ్‌కు సత్సంబంధాలున్నాయి. దాదా మృతితో కాంగ్రెస్‌ పార్టీతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో ముగినిపోయింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు కేంద్రమంత్రులు, సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు