• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PRANAB MUKHERJEE BHUPEN HAZARIKA TO BE CONFERRED BHARAT RATNA TODAY MS

నేడు భారతరత్న అందుకోనున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

నేడు భారతరత్న అందుకోనున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(File)

ఈ ఏడాది జనవరిలో ప్రణబ్ ముఖర్జీ,భూపేన్ హజారికా,నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రణబ్ ముఖర్జీ సేవలను కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీ అద్భుతమైన రాజనీతివేత్త అని ప్రశంసించారు.

  • Share this:
    మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును అందుకోనున్నారు. ఆయనతో పాటు దివంగత సింగర్-మ్యూజిషియన్ భూపేన్ హజారికా, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు దివంగత నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్నను ప్రధానం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 6గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

    ఈ ఏడాది జనవరిలో ప్రణబ్ ముఖర్జీ,భూపేన్ హజారికా,నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రణబ్ ముఖర్జీ సేవలను కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీ అద్భుతమైన రాజనీతివేత్త అని ప్రశంసించారు. నిస్వార్థంగా,అలుపెరగకుండా దశాబ్దాల పాటు ఆయన దేశ సేవ చేశారని అన్నారు. ఆయన భారతరత్న అందుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నట్టు తెలిపారు. భారతరత్న ప్రకటన తర్వాత స్పందించిన ప్రణబ్.. దేశానికి తాను ఇచ్చిన దానికంటే దేశం ఎక్కువ ఇచ్చిందని చెప్పారు. కాగా, ప్రణబ్ ముఖర్జీ(83) 2012-2017 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

    First published: